ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తే ఓడిస్తాం

ABN , First Publish Date - 2023-06-24T00:34:05+05:30 IST

పిఠాపురం, జూన్‌ 23: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తే సామాన్య జనసైనికుడిని నిలబెట్టి ఓడిస్తామని జనసేన పార్టీ నియోజకవర్గ నేత డాక్టర్‌ పిల్లా శ్రీధర్‌ అన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన ముద్రగడ తీరుపై మాట్లాడుతూ ప్రజల్లో ఉనికిని కోల్పోయిన ముద్రగడ దానిని చాటుకునేందుకే పవన్‌కు లేఖలు రాస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ డైరెక్షన్‌లో ముద్రగడ పనిచేస్తున్నారని విమ

ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తే ఓడిస్తాం
పిఠాపురం సమావేశంలో మాట్లాడుతున్న శ్రీధర్‌

జనసేన నేత డాక్టర్‌ పిల్లా శ్రీధర్‌

పిఠాపురం, జూన్‌ 23: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తే సామాన్య జనసైనికుడిని నిలబెట్టి ఓడిస్తామని జనసేన పార్టీ నియోజకవర్గ నేత డాక్టర్‌ పిల్లా శ్రీధర్‌ అన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన ముద్రగడ తీరుపై మాట్లాడుతూ ప్రజల్లో ఉనికిని కోల్పోయిన ముద్రగడ దానిని చాటుకునేందుకే పవన్‌కు లేఖలు రాస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ డైరెక్షన్‌లో ముద్రగడ పనిచేస్తున్నారని విమర్శించారు. ముద్రగడకు ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు తగు రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముద్రగడ లేఖలపై స్పందించేందుకు పవన్‌ అవసరం లేదని, జనసైనికులు సరిపోతారని ఎద్దేవా చేశారు. ఇంతకి ముద్రగడ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని వంగ్యంగా వ్యాఖ్యానించారు. సమావేశంలో నాయకులు కంబాల దాసు, వెన్నపు చక్రధరరావు, పల్లేటి బాపన్నదొర, గరగ సత్యానందం, వంకా కొండబాబు పాల్గొన్నారు.

‘రామకోటి రాసుకోండి’

గండేపల్లి: ఖాళీగా ఉంటే రామకోటి రాసుకోండి అంతేకానీ రోజుకో లేఖ రాయడం ఏంటని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని జనసేన పార్టీ గండేపల్లి మండలాధ్యక్షుడు గోన శివ, యరమళ్ళరాజు ప్రశ్నించారు. వారు మాట్లాడు తూ మీరు మంత్రిగా, ఎంపీగా ఎన్నో పదవులు చేసి ఆ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏం టో చెప్పాలన్నారు. మా పార్టీ అధినేత పవన్‌ ఏ పదవి చేయకుండానే ఎంతోమందికి మేలు చేస్తున్నారని వాటిని తెలుపుతాం మీరు ఏం చేశారో తెలపాలన్నారు. గతంలో ప్రజారాజ్యం తరుపున పోటీ చేసిన వంగాగీతపై పిఠాపురం నుంచి ఓడిపోయిన విషయం గుర్తు చేశార. మరోసారి నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఎన్నిఓట్లు వచ్చాయో మర్చిపోయారా అన్నారు.

Updated Date - 2023-06-24T00:34:05+05:30 IST