మాడిపోతున్న ఆశలు

ABN , First Publish Date - 2023-02-20T00:48:59+05:30 IST

జీడిమామిడి పంట వరుస నష్టాలను చవిచూస్తోంది. దీంతో రైతాంగం లబోదిబోమం టున్నారు. గతేడాది గిట్టుబాటు ధర లేక జీడిమామిడి రైతులు నష్టాలను చవిచూశారు. ఈ ఏడాది వాతావరణ ప్రభావంతో మంచు ఎక్కువగా పడి పూత మాడిపోతూ రైతు ఆశలను ఆడియాశలు చేస్తుంది.

మాడిపోతున్న ఆశలు
మాడిపోయిన పూత

మాడిపోతున్న పూత.. రైతుల ఆందోళన

నల్లజర్ల,ఫిబ్రవరి 19 : జీడిమామిడి పంట వరుస నష్టాలను చవిచూస్తోంది. దీంతో రైతాంగం లబోదిబోమం టున్నారు. గతేడాది గిట్టుబాటు ధర లేక జీడిమామిడి రైతులు నష్టాలను చవిచూశారు. ఈ ఏడాది వాతావరణ ప్రభావంతో మంచు ఎక్కువగా పడి పూత మాడిపోతూ రైతు ఆశలను ఆడియాశలు చేస్తుంది. ప్రతి ఏటా ఏదో రూపంలో జీడి మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు.ఈ ఏడాది జీడిమామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. శివరాత్రి వచ్చినా మంచు పడుతూనే ఉంది. జీడి మామిడి చెట్లకు పూతబాగున్నా మంచు కారణంగా మాడిపోతుంది. దీంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు ప్రభావం తక్కువగా ఉంటే జీడి తోటలు బాగుంటాయి. అటువంటిది ఈ ఏడాది మాత్రం మంచు ప్రభావం అధి కంగా ఉంది.పూత రాలిపోవడం, మంచు ప్రభావం ఎక్కు వగా ఉండి చెట్లపై పూత మాడిపోవడంతో రైతులు కంట తడి పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 27వేల 95 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇప్ప టికే ఈ నష్టాలను భరించలేక చాలా చోట్ల ఆయిల్‌ ఫాం సాగు చేస్తున్నారు.సాగు విస్తీర్ణం తగ్గుతున్నా దళారీ వ్య వస్థ కారణణగా ధర ప్రతి ఏటా పతన స్థితిలో ఉంటుంది. ప్రతి ఏటా నష్టాల పాలవుతున్న జీడిమామిడి రైతులను ఆదుకోవాలని మెట్ట ప్రాంత రైతులు కోరుతున్నారు. ఏడాదికో పంట చేతికి వచ్చి చేసిన అప్పులు తీరుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా రైతులకు ఒక్కసారిగా ధర పతనం కావడం,మంచు ప్రభావంతో పూత మాడిపోవడం వంటి కారణాలతో ఏడాదంతా పెట్టుకున్న ఆశలు ఆడియాశలుగా మారిపోతున్నాయి.

పూత రాలకుండా ఇలా చేయండి

జీడిమామిడి పూత రాలిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. పూత రాలిపోతుంటే ఇమిడోక్లఫ్రిడ్‌ లీటరు నీటికి 0.5 ఎంఎల్‌ మందు, సాప్‌ ఒక గ్రాము మందును కలిపి పిచికారీ చేయాలి.

- శ్రీలక్ష్మి , నల్లజర్ల ఉద్యాన అధికారిణి

Updated Date - 2023-02-20T00:49:01+05:30 IST