గుట్టు చప్పుడు కాకుండా!

ABN , First Publish Date - 2023-05-10T00:27:36+05:30 IST

గోదావరి జిల్లాల జీడి పప్పుకు పక్క రాష్ర్టాల్లో ఉన్న డిమాండే వేరు.ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టు కుని ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా అడ్డదా రిన ప్రతినిత్యం భారీ ఎత్తున జీడిపప్పు ఇతర రాష్ట్రా లకు తరలించేస్తున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా!
బస్సుల ద్వారా తరలిస్తున్న జీడిపప్పు

బస్సుల ద్వారా రాష్ర్టాలు దాటవేత

నిత్యం సా..గుతున్న ఎగుమతులు

కన్నెత్తి చూడని అధికారులు

లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి

నిడదవోలు, మే 9 : గోదావరి జిల్లాల జీడి పప్పుకు పక్క రాష్ర్టాల్లో ఉన్న డిమాండే వేరు.ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టు కుని ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా అడ్డదా రిన ప్రతినిత్యం భారీ ఎత్తున జీడిపప్పు ఇతర రాష్ట్రా లకు తరలించేస్తున్నారు.ఇందుకు చక్కగా గోదా వరి జిల్లాల నుంచి హైదరా బాద్‌కు వెళ్లే ప్రైవేటు, ఆర్టీసీ బస్సులనే యఽథేచ్ఛగా ఉపయోగిం చుకుంటున్నారు.ఈ జీడిపప్పు మాఫియాకు అధి కార పార్టీ నేత సిండికేట్‌ లీడర్‌గా ఉంటూ కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాడు. నిడదవోలు మండలం తాడిమళ్ళ, చాగల్లు మం డలం చిక్కాల, దేవరపల్లి ప్రాంతాల్లో జీడిపిక్కల నుంచి పప్పు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడికి కేరళ, శ్రీకాకుళం లోని పలాస ప్రాంతాల నుంచి అక్రమంగా లారీల ద్వారా జీడి పిక్కలు దిగుమతి అవుతుంటాయి. తాడిమళ్ళ, చిక్కాల ప్రాంతా లకు వచ్చిన లారీలను గ్రామ శివారులోనే ఉంచి తెల్లవారు జామున సరుకును దిగుమతి చేసుకుని పంపించేస్తుంటారు. ఇక్కడకు జీడిపిక్కలు రవాణా చేసే లారీలకు ఎటువంటి వే బిల్లులు ఉండవు.అయినా వాణిజ్య పన్నుల శాఖాధికారు లు చూసీచూడనట్టు వదిలేస్తారు.ఇలా వచ్చిన జీడి పిక్కలను కాల్చి న తరువాత పప్పు తీయడం, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ వంటి పను లన్నీ కుటీర పరిశ్ర మల మాదిరిగా కొందరి ఇళ్లు, పరిశ్ర మల్లో యథేచ్ఛగా సాగుతుంది.గ్రేడింగ్‌ చేసిన జీడిపప్పు, గుం డు,బద్ద లను ప్యాకింగ్‌ చేసి ఇక్కడ నుంచి తెలంగాణ, కర్ణాటక, కల కత్తా వంటి ప్రాంతాలకు వివిధ మార్గాల్లో తరలిస్తున్నారు.

బస్సుల్లో గుట్టుగా రవాణా..

నిడదవోలు నుంచి హైదరాబాద్‌ వెళ్లే బస్సుకు తాడిమళ్ళ నుంచి కోరుమామిడి మధ్యలో ఏదో ఒకచోట ప్రతినిత్యం సుమారు 60 బాక్సుల జీడిపప్పు లోడును ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సు డిక్కీల లో లోడు చేస్తుంటారు. ఒక్కో బాక్సులోను సుమా రు 30 కిలోల జీడిపప్పు ఉండగా 60 బాక్సుల్లో 1800 కిలోల జీడిపప్పు రవాణా అవుతుంది.కిలో జీడిపప్పు రూ.600 లెక్కన ఒక్క బస్సులో రూ.1.80 లక్షల జీడిపప్పు ఎటువంటి ట్యాక్సు చెల్లించకుండా తెలంగాణకు ఆర్టీసి బస్సు ద్వారానే యథేచ్ఛగా సరఫరా జరుగుతుంది. బస్సు ఆగే సమయానికి ఆటోలు టాటా ఏస్‌ వాహనాల ద్వా రా జీడిపప్పు బాక్సులు చేరుకుంటాయి. వెనుక డిక్కీలో కళ్ళు మూసి తెరిచేలోగా లోడింగ్‌ అయి పోతుంది.ఉదయానికి కావాల్సిన ప్రాంతానికి చేరు కుంటుంది. ఇలా చాలా కాలంగా జీడిపప్పు జిల్లాలను దాటించేస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

ప్రతి నెలా కోట్లలో వ్యాపారం సాగుతుంది. అయినా ఈ వ్యాపారం నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతంతమా త్రమే. ఎందుకంటే ఇక్కడి నుంచి జీడిపప్పు బయట రాష్ట్రాలకు ఎటువంటి ట్యాక్సులు చెల్లించకుండానే తరలించేస్తున్నారు. ఇందుకు గాను వాణిజ్య పన్నుల శాఖ అధికా రు లు, సిబ్బందికి జీడిపప్పు వ్యాపారస్తుల సిండికేట్‌గా మారి మామూళ్ళ ఇచ్చేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.ఒక వేళ ఎప్పుడైనా దాడులు చేసినా చిన్న మొత్తం జరిమానాగా విధించి వదిలేస్తున్నట్టు తెలిసింది. ఇలా జీడిపప్పు అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయ లుగా యథేచ్ఛగా సాగిపోతోంది. నిడదవోలు మండలంలోని ఒక గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తోంది. జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్టీ) అధికారులు జీడిపప్పు అక్రమ రవాణాపై దృష్టి సారిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూ రనుంది. నిడదవోలు, దేవరపల్లి నుంచి హైదరా బాద్‌ వెళ్లే ప్రైవేటు, ఆర్టీసీ బస్సులను అకస్మాత్తుగా తనిఖీ చేస్తే జీడిపప్పు మాఫియా గుట్టురట్టవుతుంది. తనిఖీలు చేపట్టి అక్రమా ర్కుల ఆట కట్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కాపా డాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2023-05-10T00:27:36+05:30 IST