మాయాజాలం
ABN , First Publish Date - 2023-07-07T01:32:45+05:30 IST
ప్రభుత్వ ఆస్తులే కదా.. మాదేం పోయె అన్న చందంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాకినాడ సురేష్‌నగర్ ప్రాంతంలో స్థల కేటగిరీ, ధరల పెంపునకు సంబంధించి జరిగిన అవకతవకల్లో ఇప్పటికే ఉన్నతాధికారులు సర్పవరం సబ్‌రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు.
రెసిడెన్షియల్ ప్రాంతాన్ని కమర్షియల్‌గా మార్చి టీడీఆర్ బాండ్ల జారీ
కాకినాడ సురేష్‌నగర్‌లో స్థలాల ధరల పెంపులో అవకతవకలు
కాకినాడ టౌన్ ప్లానర్ కనికట్టు
కోట్లాది ప్రజాధనం కొట్టేసేందుకు స్కెచ్!
ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
టీపీవోపై చర్యల కోసం డిమాండ్
సర్పవరం జంక్షన్, జూలై 6: ప్రభుత్వ ఆస్తులే కదా.. మాదేం పోయె అన్న చందంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాకినాడ సురేష్‌నగర్ ప్రాంతంలో స్థల కేటగిరీ, ధరల పెంపునకు సంబంధించి జరిగిన అవకతవకల్లో ఇప్పటికే ఉన్నతాధికారులు సర్పవరం సబ్‌రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగిన మొత్తం వ్యవహారంపై అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. పార్కు నాలుగు చుట్టుపక్కలా రెసిడెన్షియల్‌గా ఉండడంతో కమర్షియల్ ప్రాంతంలో ఉన్నట్లు సదరు టీపీఆర్ అధికారి పక్కా స్కెచ్‌తో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇతరులకు లబ్ధి చేకూరేలా చేసి భారీస్థాయిలో ముడుపులు తీసుకున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిలిచిపోయిన సురేష్‌నగర్‌పార్కు నిర్మాణ పనులు
కాకినాడ కార్పొరేషన్ 3వ డివిజన్ సురేష్‌నగర్‌లో 1980లో సర్వే నెం బర్ 212/సీ లో లేఅవుట్ చేశారు. శాస్త్రినగర్, సురేష్‌నగర్‌కు చెందిన లే అవుట్లకు చెందిన సామాజిక స్థలంగా నాలుగెకరాల భూమిని సామాజిక స్థలంగా మున్సిపల్ కార్పొరేషన్‌కు దఖలు చేశారు. ఈ స్థలంలో ఇక్కడ నివసించే ప్రజల ఆహ్లాదంకోసం సురేష్‌నగర్ పార్కుగా ఏర్పాటు చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థలం చుట్టూ రక్షణకోసం ప్రభుత్వం ప్రహారీ నిర్మించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేసింది. తదనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్‌సిటీ నిధులు రావడంతో పార్కు ఆధునికీకరణ, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.18కోట్లు మంజూరు చేసింది. అభివృద్ధి పనులు నిర్మాణంలో ఉండగా 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బిల్లుల చెల్లింపులో జాప్యంతో కాకినాడలో నిర్మాణంలో పలు పనులతోపాటు సురేష్‌నగర్‌పార్కులో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఇదీ జరిగింది
సురేష్‌నగర్ పార్కులో 1.93ఎకరాల భూమి తమదంటూ కొంత మంది హైకోర్టును ఆశ్రయించగా ఈ విషయమై కోర్టు కాకినాడ నగరపాలక సంస్థకు నోటీసు జారీ చేసింది. స్మార్ట్‌సిటీ నిధులతో అభివృద్ధి జరుగుతుందని తప్పు తమదేనంటూ స్థల యాజమానులకు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తామంటూ కోర్టుకు అధికారులు వెల్లడించారు. 2022, మార్చి 19న కార్పొరేషన్ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో ఈ స్థలానికి టీడీఆర్ బాండ్ల జారీ అంశాన్ని ప్రధాన అజెండాగా పెట్టి ఆమోదించారు. ఈ తీర్మానానికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా వాటిని భేఖాతరు చేస్తూ పాలకపక్షం తీర్మానం చేసింది. పాలకవర్గం తీర్మానం మేరకు ఈఏడాది మే 6న 36,324 చ.గ.లకు టీడీఆర్ బాండ్లు జారీ చేసింది. ఏదైనా ఓ స్థలానికి బాండ్లు జారీ చేసేటప్పుడు నిబంధనల మేరకు సమీపంలో డోర్ నెంబర్‌ని ప్రస్తావిస్తారు. కానీ ఇ క్కడ అక్రమాలకు తెరలేపారని విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నా యి. టీడీఆర్ బాండ్లు నమోదైన సమయానికి టౌన్‌ప్లానింగ్ అధి కారి జారీ చేసిన డోర్ నెంబర్ 70-15-69లో ప్రభుత్వ విలువ చదరపు గజం రూ.18వేలుగా ఉంది. దాని ప్రకారం ఆ బాండ్ల విలువ 36,324 చ.గ లకు రూ.64.62కోట్లు. ఇక్కడ వరకు కథ సాఫీగా సాగింది.
రెసిడెన్షియల్‌ను కమర్షియల్‌గా ఏ మార్చి..
కాకినాడ నగరపాలక సంస్థలో గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు డోర్ నెంబర్లు కేటాయిస్తుంటారు. ముందుగా ప్లాన్ అప్రూ వల్ తర్వాత, భవన నిర్మాణానికి అన్ని అనుమతులు మంజూరు చేసిన తర్వాత నిర్మాణం ప్రారంభించి పనులు పూర్తయిన వెంటనే ప్లానింగ్ అధికారులు డోర్ నెంబర్లు కేటాయించడం పరిపాటి. సురేష్‌నగర్ పరిసర ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ అధికారి జారీ చేసిన డోర్ నెంబర్ సురేష్‌నగర్ చుట్టూ 70-15-30 నుంచి 70-15-45 వరకు డోర్ నెంబర్లు ఉన్నాయి. బాండ్ల జారీకి తప్పనిసరిగా డోర్ నెంబర్ ఉండాలి. దీంతో ప క్కన ఉన్న నెంబర్ వేయాలి. అలా వేయకుండా కాసులకు కక్కుర్తిపడిన టౌన్‌ప్లానింగ్ అధికారులు స్వామి భక్తి చూపించుకునేందుకే డీమా ర్ట్ ఏరియాకు దగ్గరలో ఉన్న కమర్షియల్ ప్రాంతానికి పక్కనే ఉన్న 70-15-69గా డోర్ నెంబర్ ఉన్న దానిపై టీడీఆర్ బాండ్లు జారీ చేయ డం నిదర్శనం. ఈ మేరకు ఈ ఏడాది మే 23న విశాఖ ఎంపీ రిజిస్ర్టేష న్ అండ్ స్టాంప్స్ డీఐజీకి ఒక సిఫారసు లెటర్ రాశారు. 70-15-69 డోర్ నెంబర్‌గల స్థలం కమర్షియల్ ఏరియాలో ఉందని, స్థలం విలువ పెం చాలని యాజమానులు కోరుతున్నారని, పరిశీలించాలని ఎంపీ సిఫారసు చేశారు. తదనంతరం సర్పవరం సబ్‌రిజిస్ట్రార్‌కు డీఐజీ నుంచి లేఖ రావడం, భూముల విలువ పెంపులో కన్వీనర్‌గా ఉండే సబ్‌రిజిస్ట్రార్ క మిటీలో చర్చించి రెసిడెన్షియల్ ప్రాంతాన్ని పరిశీలించకుండా కమర్షియ ల్ కేటగిరీలోకి మార్చి వాణిజ్య స్థలంగా మార్చేశారు. దీంతో అప్పటి వరకు ఉన్న సదరు బాండ్ల ఆస్తి విలువ రూ.64కోట్లనుంచి రూ.129కో ట్లయింది. దీంతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడడానికి ఎత్తులు వేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.