పారదర్శకంగా ఓటర్ల జాబితా : ఆర్డీవో

ABN , First Publish Date - 2023-06-21T00:02:12+05:30 IST

కరప, జూన్‌ 20: గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కాకినాడ ఆర్డీవో ఎన్‌వీవీ.సత్యనారాయణ సూచించారు. కరప తహశీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్షా సమా

పారదర్శకంగా ఓటర్ల జాబితా : ఆర్డీవో

కరప, జూన్‌ 20: గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కాకినాడ ఆర్డీవో ఎన్‌వీవీ.సత్యనారాయణ సూచించారు. కరప తహశీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలోని లోటుపాట్ల సవరణ తదితర అన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. నడకుదురులో సచివాలయ భవన నిర్మాణ ప నులు, పెనుగుదురులో రీసర్వే పనులు పరిశీలించారు. తహశీల్దార్‌ పొన్నమండ శ్రీనివాసరావు, డీటీ కె.అనిల్‌కుమార్‌, ఆర్‌ఐ పేపకాయల మాచరరావు, రీసర్వే డీటీ సురేష్‌, మండల సర్వేయర్‌ ఈ.రామకృష్ణ, మండలపరిషత్‌ కార్యాలయ ఏవో గుత్తుల భీమశంకరరావు, పంచాయతీరాజ్‌ ఏఈ శైలజ, ఈవోపీఆర్డీ ఎస్‌వీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-21T00:02:12+05:30 IST