సమస్యలు పరిష్కారం కావాలి: ఎస్పీ
ABN , First Publish Date - 2023-05-02T00:59:24+05:30 IST
కాకినాడ క్రైం, మే 1: వ్యక్తిగత సమస్యలతో స్థాని క పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే బాధితులకు స్థానికంగా సత్వర పరిష్కారం అందించాలని ఎస్పీ సుబ్రమణి సతీ్‌షకుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవె
కాకినాడ క్రైం, మే 1: వ్యక్తిగత సమస్యలతో స్థాని క పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే బాధితులకు స్థానికంగా సత్వర పరిష్కారం అందించాలని ఎస్పీ సుబ్రమణి సతీ్‌షకుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్‌కు జిల్లావ్యాప్తంగా 27 మంది అర్జీదారులు హాజరై తమ గోడును ఎస్పీకి విన్నవించారు. బాధితుల సమక్షంలో సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు సమ్మతమైనవైతే వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసి సాధ్యమైన త్వరితగతిన సమస్య పరిష్కారానికి చర్యలు చేసట్టాలని సూచించారు. అర్జీదారులు వారి సహాయకులకు చార్టర్డ్ అకౌంటెంట్ డీపీఆర్ స్వామి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అడ్మిన్ ఎస్పీ పి.శ్రినివాస్, ఎస్‌బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్ పాల్గొన్నారు.