లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2023-01-09T00:18:07+05:30 IST
టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్ పిలుపునిచ్చారు.ఆదివారం ఒంటిమామిడి టీడీపీ కార్యాలయంలో జరిగిన తెలుగు యువత సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లోకేష్ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ చేపట్టే పా
తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు శివరామకృష్ణన్
తొండంగి, జనవరి 8: టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్ పిలుపునిచ్చారు.ఆదివారం ఒంటిమామిడి టీడీపీ కార్యాలయంలో జరిగిన తెలుగు యువత సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లోకేష్ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ చేపట్టే పాదయాత్రలో యువత పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని యువకులను చైతన్య పర్చాలన్నారు. రాష్ట్రంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడుతున్నారన్నారు. ఉపాధి అవకాశాలు పూర్తిగా మరుగయ్యాయయని, యువత సమస్యలపై పోరాటం చేస్తున్న లోకే ష్‌కు మద్దతుగా నిలిచేందుకు యువగళం లక్ష్యం వివరిస్తూ యువకుల భాగస్వామ్యాన్ని కోరాలన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.