గరుడవాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు

ABN , First Publish Date - 2023-04-30T00:08:26+05:30 IST

దేవరపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ప్రధాన వార్షికోత్సవం, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నుంచి ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం, గజారోహణం, నివేదన, మం గళ శాసనం, అగ్నిప్రతిష్టాపన, కుంభకళా అవాహానం, నిత్యహోమం, డోలోత్సవం నిర్వహించారు.

గరుడవాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు
గరుడవాహనంపై వేంకటేశ్వరస్వామి ఊరేగింపు నిర్వహిస్తున్న దృశ్యం

దేవరపల్లి, ఏప్రిల్‌ 29: దేవరపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ప్రధాన వార్షికోత్సవం, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నుంచి ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం, గజారోహణం, నివేదన, మం గళ శాసనం, అగ్నిప్రతిష్టాపన, కుంభకళా అవాహానం, నిత్యహోమం, డోలోత్సవం నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారిని ప్రత్యేకంగా అలం కరించి పురవీధుల్లో మేళతాళలతో, భజనకోలాటాలతో ఊరేగించారు. కేసిరాజు శారదాదేవి బృందంతో సంగీతం సంకీర్తనామృతం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Updated Date - 2023-04-30T00:08:26+05:30 IST