లారీ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2023-04-12T00:24:30+05:30 IST

జాతీయ రహదారిపై జీఎస్‌ఎల్‌ సమీపంలోని చాగల్నాడు కాలువ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమా దంలో గ్రామ సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు.

లారీ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి

రాజానగరం, ఏప్రిల్‌ 11 : జాతీయ రహదారిపై జీఎస్‌ఎల్‌ సమీపంలోని చాగల్నాడు కాలువ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమా దంలో గ్రామ సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు. రాజమహేంద్రవరంలోని కోటి లింగాలపేటకు చెందిన షేక్‌ సొహిద్దీన్‌ బాబా (25) అనే యువ కుడు పాత పెద్దాపురంలో గ్రామ సచివాలయ ఉద్యో గిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు రాజ మహేంద్రవరం నుంచి బస్సులో వెళ్తూ, అప్పు డప్పుడు మోటార్‌ సైకిల్‌పై కూడా విధులకు వెళ్లి తిరిగి వస్తుంటాడు. ప్రతిరోజు మాదిరిగానే వెళ్లిన సోహిద్దీన్‌ సోమవారం సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని ఆఫీస్‌లో పని ఉందని రాత్రి 8 గంటలకు భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఈ నేపఽథ్యంలో మంగళవారం తెల్లవారుజామున మార్గ మధ్యంలో దుర్గమ్మ గుడి సమీపంలో లారీ ఢీకొన డంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సీఐ పి.కాశీవిశ్వనాథ్‌ పర్యవేక్షణలో రాజానగరం ఎస్‌ఐ జుబేర్‌ కేసు నమోదు చేశారు. బాబాకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఇతనిపైనే కుటుంబ సభ్యులు ఆధారపడి జీవిస్తున్నారు.

Updated Date - 2023-04-12T00:24:31+05:30 IST