రేషన్‌ పంపిణీ చేయలేం..

ABN , First Publish Date - 2023-03-10T00:43:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మొబైల్‌ డిస్పోజబుల్‌ యూనిట్‌ (ఎండీయూ) ఇంటింటికి రేషన్‌ పంపిణీ వాహనాల దారెటో తెలియక సిబ్బంది ఆందోళన చెందుతు న్నారు.

రేషన్‌ పంపిణీ చేయలేం..
నిడదవోలులో గురువారం కదలని ఎండీయూ వాహనం

నిడదవోలు, మార్చి 9 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మొబైల్‌ డిస్పోజబుల్‌ యూనిట్‌ (ఎండీయూ) ఇంటింటికి రేషన్‌ పంపిణీ వాహనాల దారెటో తెలియక సిబ్బంది ఆందోళన చెందుతు న్నారు.నిడదవోలు పట్టణ మండలంలో గురువారం రేషన్‌ పంపిణీ వాహనాలు తీయమంటూ భీష్మించారు. సకా లంలో జీతాలు పడడం లేదని.. అందులో కోతలు ఎక్కు వగా ఉంటున్నాయని ఆందోళనకు దిగారు.సివిల్‌ సప్లయిస్‌ అధికారులు వాహన యజమానులను బ్రతిమాలి రేషన్‌ పంపిణీ చేయించారు. దీనిపై అధికారులను ఆరా తీయగా వారి జీతాల నుంచి సంబంధిత బ్యాంక్‌ అధికారులు ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని కోత వేయడంతో ఆందోళనకు దిగినట్టు చెబుతున్నారు.దీనిపై ఇటు అధికారులు.. సిబ్బంది నుంచి భిన్న వాదనలు వినపడుతున్నాయి. ఏదేమైనా రేషన్‌ పంపిణీపై నీలి నీడలు అలుముకుంటున్నాయి.

Updated Date - 2023-03-10T00:43:59+05:30 IST