MLA Gorantla: ఏపీ అంథకారంగా మారింది..
ABN , First Publish Date - 2023-06-12T15:56:46+05:30 IST
రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల ఏపీ అంథకారంగా మారిందని...
రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (TDP MLA Gorantla Butchaiah Chaudhary) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల ఏపీ (AP) అంథకారం (Darkness)గా మారిందని, వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కోతల (Power Cuts)తో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
గత నెలలో ఒక ఇంటికి 400 రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని, ఈ నెలలో బిల్లు రూ. 1600కు పెరిగిందని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. వైసీపీ పాలనలో కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. టీడీపీ హయంలో 35 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) ఆగేదిలేదని, యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు యాత్ర.. లోకేష్ యాత్ర కూడా సాగుతుందన్నారు. పోలీసులు ఏ యాత్రను ఆపలేరని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.