ముగ్గులొలికే..
ABN , First Publish Date - 2023-01-08T01:14:57+05:30 IST
రాజమహేంద్రవరం ఎస్‌కేవీటి డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం ‘‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు...గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్..ఫ్రాగ్రెన్స్ పార్టనర్ బెట్కో వారి అన్నమయ్య అగరవత్తులు..హెల్త్ పార్టనర్ అమృతబిందు..ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ మరియు సెల్సియా’’ ఆధ్వర్యంలో శనివారం జరిగాయి.
రాజమహేంద్రవరం సిటీ జనవరి 7 : రాజమహేంద్రవరం ఎస్‌కేవీటి డిగ్రీ కళాశాల ఆవరణలో శనివారం ‘‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ టాటా టీ జెమిని ముత్యాల ముగ్గుల పోటీలు...గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్..ఫ్రాగ్రెన్స్ పార్టనర్ బెట్కో వారి అన్నమయ్య అగరవత్తులు..హెల్త్ పార్టనర్ అమృతబిందు..ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ మరియు సెల్సియా’’ ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. రంగ వల్లుల పోటీల్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొనడం ఒక ఎత్తయితే కళాశాల ప్రాంగంలో జరగడంతో విద్యార్థులు సందడి చేశా రు. సంక్రాంతి పండగను మహిళలు తమ ముగ్గుల ద్వారా సాక్షాత్కరింపజేశారు. ఒకరికొకరు పోటాపోటీగా ముగ్గులను తీర్చిదిద్దడం కనిపించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పోటీలో ఉన్న మహిళలతో కలిసి ఆనందం పంచుకున్నారు.స్వయంగా ముగ్గులు వేసి వారికి బెస్టాఫ్ లక్ చెప్పారు. మొత్తం 99 మంది మహిళలు, యువతులు పాల్గొన్నారు. లోకల్ స్పాన్స రర్స్‌గా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదిరెడ్డి భవానీ వాసు,కేఎస్‌ఎన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కుం దుల సత్యనారాయణ వ్యవహరించారు.
విజేతలు వీరే : పి.పావని,కె.కుమారి,షణ్ముక ప్రమీల మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వరుసగా రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు నగదు బహుమతి అందజేశారు. కన్సొలేషన్ బహుమతులు పిల్లా వరలక్ష్మి,వి.రాధ, కె.నాగలక్ష్మి, కె.సృజన, జి.వసుంధర, బి.శారద, వి.సావిత్రి , టి.ఆదిశ్రీ, పి.శ్రావణి(జగ్గంపేట), కె.రూపవతి (కడియపులంక) గెలుచుకున్నారు.
ముగ్గుల పోటీలకు మంచి స్పందన
‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ముగ్గుల పోటీలకు మంచి స్పందన లభించింది.. సంస్కృతి సంప్రదాయాలను ప్రతి మహిళా గుర్తుంచుకోవాలి. ముగ్గుల పోటీలతో కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యే భవాని, రాజమహేంద్రవరం
ముగ్గులు వేస్తేనే పండుగ శోభ..
ముగ్గులు వేస్తేనే పండుగ శోభ వస్తుంది. అందమైన ముగ్గులు వేసిన మహిళలకు, పోటీలు నిర్వహించిన ఆంధ్రజ్యోతికి అభినందనలు. నాకు ఆంధ్రజ్యోతి అంటే ప్రత్యేక అభిమానం.
- కుందుల సత్యనారాయణ, కేవీవీఎస్‌ఎన్ ఇన్‌ఫ్రా ఎండీ
పోటీలు అభినందనీయం
‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ సంస్థ సామాజిక బాధ్యతగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం. ముగ్గుల పోటీలకు వచ్చే ఏడాది మరింత ఎక్కువగా తమవంతు సహకారం అందిస్తాం. మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకూడదు.
ఆదిరెడ్డి వాసు, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు
గతంలో సెకండ్ వచ్చా.. ఈ ఏడాది ఫస్ట్ వచ్చా..
‘‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’’ సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. నా ముగ్గుకు ప్రథమ స్థానం రావడం ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది పాల్గొంటా. గతంలో సెకండ్ ప్లేస్ వచ్చింది. ఈ ఏడాది ప్రఽథమ స్థానంలో నిలిచా.
- పావని, మోరంపూడి, ప్రథమ బహుమతి విజేత
ఆంధ్రజ్యోతి మహిళలను ప్రోత్సహిస్తోంది..
‘ఆంధ్రజ్యోతి’ మహిళలను ప్రోత్సహిస్తోంది. సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు. నాకు సెకండ్ ప్రైజ్ రావడం సంతోషంగా ఉంది. ఇక నుంచి ప్రతి ఏడాది పాల్గొంటా.
- కె.కుమారి, బొమ్మూరు, ద్వితీయ బహుమతి విజేత
బహుమతి వస్తుందని ఊహించలేదు..
‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీ చాలా బాగా జరిగింది. ఇంతలా జరుగుతుందని అనుకోలేదు. అంతా సహకరించారు.నా ముగ్గుకు మూడో స్థానం వస్తుందని ఉహించలేదు. చాలా సంతోషంగా ఉంది.
- షణ్ముక ప్రమీల, హుకుంపేట, తృతీయ బహుమతి విజేత