ఓటేసి గెలిపిస్తే జనవారాహినవుతా

ABN , First Publish Date - 2023-06-15T01:36:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవి ష్యత్తు గోదావరి జిల్లాల చేతుల్లోనే ఉందని జనసేన అధి నేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆవేశంతో ఓటు వేయొద్దని.. ఆలోచించి ఓటు వేయాలని కోరారు. జనసేనను విజయవంతంగా అసెంబ్లీకి పంపిస్తే కడ శ్వాస వరకు ప్రజలకు అండగా నిలబడతా.. గోదావరి నది ఈ నేలను విడిచి ఎలా వెళ్లలేదో... ఈ పవన్‌కల్యాణ్‌ కూడా ఈ నేలను విడిచి వెళ్లలేడన్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం ఉదయం సత్యదేవుడిని దర్శించుకున్న పవన్‌కళ్యాణ్‌ సాయంత్రం వరకూ జిల్లా నేతలతో సమీక్షించారు.

ఓటేసి గెలిపిస్తే జనవారాహినవుతా

  • గోదావరి జిల్లాల చేతుల్లోనే ఏపీ భవిష్యత్తు

  • ఆలోచించి ఓటేయండి..ఆవేశంతో వద్దు

  • అసెంబ్లీకి పంపిస్తే అండగా నిలబడతా

  • నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిందేంలేదు

  • దళితులు..కాపులను మోసగించారు

  • సాగునీటి ప్రాజెక్టులు గాలికొదిలేశారు

  • లేటరైట్‌ గనులను దోచుకుంటున్నారు..

  • యువతకు ఉద్యోగాలే మరిచారు

  • కాకినాడ ఎమ్మెల్యే సంగతి తేలుస్తా

  • పరివర్తన కోసమే తెగించి వచ్చా

  • నేనే కాదు.. కార్యకర్తలు తిరగాలి

  • కత్తిపూడి బహిరంగ సభలో పవన్‌

  • అశేషంగా హాజరైన జనం

శంఖవరం/తుని, జూన్‌ 14 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవి ష్యత్తు గోదావరి జిల్లాల చేతుల్లోనే ఉందని జనసేన అధి నేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆవేశంతో ఓటు వేయొద్దని.. ఆలోచించి ఓటు వేయాలని కోరారు. జనసేనను విజయవంతంగా అసెంబ్లీకి పంపిస్తే కడ శ్వాస వరకు ప్రజలకు అండగా నిలబడతా.. గోదావరి నది ఈ నేలను విడిచి ఎలా వెళ్లలేదో... ఈ పవన్‌కల్యాణ్‌ కూడా ఈ నేలను విడిచి వెళ్లలేడన్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలో బుధవారం ఉదయం సత్యదేవుడిని దర్శించుకున్న పవన్‌కళ్యాణ్‌ సాయంత్రం వరకూ జిల్లా నేతలతో సమీక్షించారు. అక్కడి నుంచి ర్యాలీగా రాత్రి 7 గంటలకు కత్తిపూడిలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణానికి చేరుకున్నారు. వారాహి వాహనంపైకి ఎక్కి తన ప్రసంగం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై నిశితంగా విమర్శలు చేశారు. సం క్షేమం అవసరం అంటూనే ఉద్యోగాల కల్పన ఆవశ్యకత ను వివరించారు. యువతతోపాటు వివిధ వర్గాలకు జనసేన పార్టీ అండగా ఎలా నిలబడగలదో తెలియజేశారు. ప్రత్తి పాడు నియోజకవర్గంలో ఎన్నో వనరులు అందు బాటులో ఉన్నా ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదన్నారు. ఉద్యోగాల కల్పన లేక స్థానిక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అక్రమాలపై ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. గత ఎన్నికల ప్రచారంలో తాను వంతాడ మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించానని, అక్కడ లేట్‌రైట్‌ పేరుతో బాక్సైట్‌ దోచేస్తున్నారన్నారు. దానిమీద విచారణ చేపడతానన్న ఇప్పటి సీఎం ఆ నివేదికను ఇప్పటివరకు బయటపెట్టడంలేదన్నారు. అది పక్కకు పెట్టి ప్రత్తిపాడు మండలం చింతలూరులో లేట రైట్‌ లీజుకు ఇచ్చి బయటకు తెలియన్విడంలేదనన్నారు. ఈ మైనింగ్‌ కంపెనీ కూడా రాయలసీమకు చెందిన ఓ వైసీపీ నాయకుడిదని తెలిసిందన్నారు.ఈ కంపెనీలు స్థానికంగా ఖర్చుపెట్టాల్సిన1 శాతం మినరల్‌ డిపాజిట్‌ ఫండ్‌ను ఇవ్వ డంలేదని తెలిపారు.మన వనరులను దోచేసి, రోడ్లు నాశనం చేసి,పిల్లల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు.ఇవి ఆగాలంటే జనసేన రావాలన్నారు. మైనింగ్‌ పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారని విమర్శించారు. వారాహి యాత్ర అన్నవరంనుంచి ప్రారంభమై మొదటిసభ కత్తిపూడిలో విజయవంతంగా పూర్తయింది. ఈ సభకు ప్రతిపాడు, తుని,జగ్గంపేట,పిఠాపురం నియోజకవర్గాల నుం చి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిశెట్టిసూర్యకిరణ్‌, కరణం సుబ్రహ్మ ణ్యం,ఇందన సత్తివీర్రాజు, గాబు సుబ్రహ్మణం పాల్గొన్నారు.

గ్లాసు గుర్తుపై ఒక్కసారి గుద్దండి

పరివర్తన కోసం తెగించి రాజకీయాల్లోకి వచ్చానని, ప్రాణం పోయేంత వరకూ నిలబడతానని గోదావరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రాన్ని ఎవరు బతికిస్తారో తెలుసుకోవాలన్నారు. సంపూర్ణమైన ఆశీస్సులను జనసేనకు ఇస్తే రైతులకు, యువతకు, వెనుకబడిన వర్గాలవారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలు అధికారం ఇస్తే అవినీతి చెయ్యబోమని, దాన్ని అరికట్టే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. జనసేన నాయకులు గ్రామాల్లో తిరగాలని, తనను తిప్పినంత మాత్రాన ఓట్లు రావని మీరు తిరిగితేనే వస్తాయని హిత వు పలికారు. పార్టీలో తిరిగే యువతకు నాయకులు అండగా నిలవాలని, వారి మంచి, చెడులు చూసుకోవాలని సూచించారు. ఇంతకాలం ఎంతో మంది నాయకులను చూశారని, ఒక్కసారి గ్లాసు గుర్తుపై ఓట్లు గుద్ది అధికారం ఇస్తే ప్రజాప్రభుత్వం స్థాపిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులు పోలింగ్‌ బూత్‌ల వద్ద దౌర్జన్యాలు చేస్తే మనం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

దళితులకేం చేశారు..

సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేశారని.. గత ముఖ్యమంత్రి పేరుపెట్టారని చంద్రబాబు సాగర్‌ పనులను నిలిపివేశారని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. చంద్రబాబు సాగర్‌కి రూ.5కోట్లు, సుబ్బారాయుడుసాగర్‌కి రూ.10కోట్లు ఖర్చుపెడితే రైతులకు సాగునీరు ఇబ్బందులు లేకుండా ఉండేవన్నారు. పుష్కర, ఏలేరు ప్రాజెక్టులను ఆధునికీకరణ చేస్తామని వైసీపీ నాయకులు ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. కాకినాడలో దళిత డ్రైవర్‌ను కొట్టిచంపి డోర్‌ డెలివరీ చేసిన నాయకుడిని ప్రభుత్వం వెనకేసుకొస్తోందని, ఇలాంటి వైసీపీ నాయకుల తీరును దళిత యువత గమనించాలని సూచించారు. అంబేడ్కర్‌కు విగ్రహాలు పెట్టి దళితులకు మేలు చేకూర్చే 18 పథకాలను రద్దు చేస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వనని చెప్పిన జగన్‌కు ఓట్లేశారని, కేంద్రప్రభుత్వం ఇచ్చిన 5 శాతం ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌ సైతం ప్రభుత్వం తొలగించిందని, ఈసారి మాత్రం ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఆ ఎమ్మెల్యే సంగతి అక్కడే తేలుస్తా..

గతంలో కాకినాడ ఎమ్మెల్యే తాగి తిట్టిన సంగతి తాను మర్చిపోలేదని, ఆ ఎమ్మెల్యే సంగతి కాకినాడలో తేల్చుకుందామని పవన్‌కల్యాణ్‌ అన్నారు. జనసేన వీరమహిళలను కులంపేరుతో దూషించి.. కొట్టింది తన గుండెల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. ఈసారి జనసేన నా యకులు, కార్యకర్తలను తిట్టేముందు వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలని, అధికారంలోకి రాగానే వాటన్నింటి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. త్వరలో ప్రజా ప్రభుత్వాన్ని, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు.

రెండు రోజులు గొల్లప్రోలులోనే..

గొల్లప్రోలు, జూన్‌ 14: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బుధవారం రాత్రి 9.15 గంటలకు గొల్లప్రోలు చేరుకున్నారు. కత్తిపూడిలో బహిరంగసభ ముగించుకున్న అనంతరం కారులో చేబ్రోలు మీదుగా గొల్లప్రోలు వచ్చారు. చేబ్రోలు బైపాస్‌ జంక్షన్‌ వద్ద భారీ సంఖ్యలో జనసైనికులు ప్లకార్డులు పట్టుకుని పవన్‌కు స్వాగతం పలికారు. వారిని చూసి కారుపైకి వచ్చిన పవన్‌ అభివాదం చేశారు. గ్రామం నుంచి వెళ్లాలని జనసైనికులు కోరారు.ముందుగా నిర్ణయించిన రూట్‌ ప్రకారం చేబ్రోలు బైపాస్‌ మీదుగా గొల్లప్రోలు చేరుకున్నారు.పట్టణంలోని రాయవరం రోడ్డులో గల మాధురి విద్యాసంస్థల అధినేత, జనసేన నాయకుడు కడారి తమ్మయ్యనాయుడు ఇంటికి రాత్రి బస నిమిత్తం వెళ్లా రు.కారులో నుంచి నేరుగా ఇంటి లోపలికి వెళ్లిపోయా రు.బుధవారం రాత్రితో పాటు గురువారం రాత్రి కూడా పవన్‌కల్యాణ్‌ ఇక్కడే బస చేయనున్నారు.

నేడు పవన్‌..జనవాణి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రలో భాగంగా గురు, శుక్రవారాల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేశారు. స్థానిక సత్యకృష్ణ ఫంక్షన్‌హాలులో గురువారం వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం కావడంతో పాటు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.ప్రముఖులు, విద్యావేత్తలు, వృత్తినిపుణులు, ఎన్జీవో తదితర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపారు.నియోజకవర్గానికి చెందిన ప్రజ లు తమ సమస్యలను పవన్‌ కల్యాణ్‌కు తెలిపేందుకు జనవాణి కార్యక్రమం ద్వారా అవకాశం కల్పిస్తామని నాయకులు తెలిపారు. జనవాణి అనంతరం వీరమహిళలతో సమావేశం ఉంటుంది.

సత్యదేవుడి సన్నిధిలో జనసేనాని ప్రత్యేక పూజలు

అన్నవరం, జూన్‌ 14: సత్యదేవుడి సన్నిధిలో బుధవారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాహి ప్రచార యాత్రలో భాగంగా మంగళవారం రాత్రికి అన్నవరం చేరుకుని రామరాజు అతిథిగృహంలో బసచేశారు. బుధవారం ఉదయం 10గంటలకు ఆయన జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సహాయ కమిషనర్‌ రమేష్‌బాబు, పీఆర్వో కృష్ణారావు, ఏపీఆర్వో పోల్నాటి లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్‌ కృష్ణప్రసాద్‌ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు భక్తులు గంటల తరబడి వేచిచూశారు. దర్శనం అనంతరం జనసేనానికి పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.

రాష్ట్రస్థాయి నాయకులతో పవన్‌ సమావేశం

అన్నవరంలోని అతిథిగృహంలో జనసేన రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితి, ఇతర అంశాలపై పవన్‌కల్యాణ్‌ చర్చించారు. పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాలని, ఎటువంటి కేసులకు జనసైనికులు భయపడక్కర్లేదని భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయినుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలను నాయకులకు వివరించారు.

Updated Date - 2023-06-15T01:36:54+05:30 IST