రాజకీయ ప్రతినిధుల సహకారం అవసరం : ఆర్డీవో

ABN , First Publish Date - 2023-08-08T23:47:15+05:30 IST

పెద్దాపురం, ఆగస్టు 8: ఓటరు జాబితాలు, రీసర్వే తదితర ప్రక్రియలో రాజకీయ ప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని ఆర్డీవో జె.సీతారామారావు అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం రాజకీయ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జరగనున్న

రాజకీయ ప్రతినిధుల సహకారం అవసరం : ఆర్డీవో

పెద్దాపురం, ఆగస్టు 8: ఓటరు జాబితాలు, రీసర్వే తదితర ప్రక్రియలో రాజకీయ ప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని ఆర్డీవో జె.సీతారామారావు అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం రాజకీయ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తూచతప్పకుండా పాటించాలన్నారు. ఓటరు జాబితాల్లో అపోహలను తొలగించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ వజ్రపు జితేంద్ర, మున్సి పల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-08T23:47:15+05:30 IST