యూరియా, డీఏపీ కొరతతో ఇబ్బందులు
ABN , First Publish Date - 2023-02-13T00:34:05+05:30 IST
ప్రస్తుత దాళ్వా సీజన్‌లో యూరియా, డీఏపీ కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం మ ండలం మాధవపురంలో ఆయన ఆదివారం రైతులతో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేక ప్రవేటు దుకాణాల్లో రైతులు అధిక ధరలకు కొనుక్కోవాల్సి వస్తున్న
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
పిఠాపురం, ఫిబ్రవరి 12: ప్రస్తుత దాళ్వా సీజన్‌లో యూరియా, డీఏపీ కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం మ ండలం మాధవపురంలో ఆయన ఆదివారం రైతులతో మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేక ప్రవేటు దుకాణాల్లో రైతులు అధిక ధరలకు కొనుక్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఒక్కొక్క బస్తాకు రూ.300 అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. రైతు భరోసాకేంద్రాల్లో అన్నిరకాల ఎరువులు అం దుబాటులో ఉంచామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా వాస్తవంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు దొరకకుంటే ఆ ప్రభావం వరి పంట దిగుబడులపై పడుతుందని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని, ధాన్యం అమ్మేందుకు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. టీడీపీ హాయాంలో ఇటువంటి ఇబ్బందులు ఉండేవికావని, ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉంచేవారమని చె ప్పారు. ఆయన వెంట టీడీపీ నాయకులున్నారు.