Share News

పనులు పూర్తికాలేదు..గ్రీన్‌సిగ్నలా!?

ABN , First Publish Date - 2023-10-27T00:09:17+05:30 IST

రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లోని యార్డు రీమోడ లింగ్‌ పనులు నత్తతో పోటీపడుతున్నాయి.దాదాపు ఐదేళ్ల పైనుంచీ కొనసాగుతూనే ఉన్నాయి.

పనులు పూర్తికాలేదు..గ్రీన్‌సిగ్నలా!?

రాజమహేంద్రవరంలో కనీస సౌకర్యాలు లేకుండా ఉన్న ఫ్లాట్‌ఫాం

ఓ ప్రజా ప్రతినిధి మెహర్బానీ

రైల్వే శాఖ అత్యుత్సాహం!

ఐదేళ్లుగా నత్తనడకన పనులు

ఎన్‌ఎస్‌జీ-2 సదుపాయాల్లేవ్‌

మరో రూ.10 కోట్లు ఉండాల్సిందే

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లోని యార్డు రీమోడ లింగ్‌ పనులు నత్తతో పోటీపడుతున్నాయి.దాదాపు ఐదేళ్ల పైనుంచీ కొనసాగుతూనే ఉన్నాయి. రైల్వే స్టేషన్‌ ఆదాయం ఇప్పటికే ఏడాదికి రూ.100 కోట్లు దాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.123 కోట్ల రాబడిని నమోదు చేసిన రైల్వే స్టేషన్‌ ఈ ఏడాది జూలై నెలలో ఎన్‌ఎస్‌జీ-3 నుంచి ఎన్‌ఎస్‌జీ-2(నాన్‌ సబర్బన్‌ గ్రూప్స్‌) హోదా దక్కించుకొంది. ఏడాదికి 40 లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా.. 160కిపైగా రైళ్లు పరు గులు పెడుతున్నాయి.కానీ రీమోడలింగ్‌ పేరిట మొదలుపెట్టిన పనులు మాత్రం 2018 నుంచీ పూర్తికాలేదు. అయితే ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి మెహర్బానీ కోసం రైల్వే అత్యుత్సాహం చూపెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లాట్‌ఫాంలపై ఎన్‌ఎస్‌జీ-2 స్థాయి సదుపాయాలు పూర్తి కాకుండానే వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారని సమాచారం.

పైసా తీసుకురాకుండానే ‘షో’కు

రాజమండ్రి రైల్వే యార్డు రీమోడలింగ్‌ పనుల కు అప్పటి ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ కృషితో 2017లో రూ.27 కోట్లు మంజూరయ్యాయి.తర్వాత కరోనా విపత్తు వల్ల సుమారు రెండేళ్ల పాటు పనులు సాగలేదు. పైగా డిజైన్లలో రెండు మూడు పర్యాయాలు మార్పులు చేశారు. వాటి అనుమతుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈలోపు రాష్ట్రం వైసీపీ చేతుల్లోకి వెళ్లి నాలుగున్నరేళ్లు అయ్యింది. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే స్టేషన్‌ పనుల నిమిత్తం కొత్తగా ఒక్క రూపాయి కూడా రాలేదు.ఇదిలా ఉండగా రైల్వే స్టేషన్‌ గురించి పట్టించు కోని ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి కొద్ది నెలల నుంచీ వడివడిగా హడావుడి మొదలుపెట్టారు. యార్డు రీమోడలింగ్‌ పనులు తమ హయాంలోనే అయి పోవాలని, ఆ ఘనత తమ ఖాతాలో వేసేసుకో వాలని రైల్వే అధికారులను ప్రాధేయపడ్డారు. ప్రారంభోత్సవానికి విచ్చేసి అంతా తామే చేశామంటూ యథావిధిగా ప్రచార మోత మోగిం చాలనే ఆలోచన చేశారు. వాస్తవానికి రైల్వే యార్డు రీ మోడలింగ్‌ పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఏలాంటి వీసమెత్తు మేలూ జరగకపోవడం గమనార్హం.

ఎన్‌ఎస్‌జీ-2 స్థాయి సదుపాయాలేవి?

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ ఎన్‌ఎస్‌జీ-2 ఘనత సాధించింది. ఇది చిన్న విషయమేమీ కాదు. ఈ ఘనత సాధించడానికి 175 ఏళ్లు పట్టింది. ఇప్పుడు స్టేషన్‌లో ఆ స్థాయిలో ప్రయాణికులకు సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రైల్వే యార్డు రీమోడలింగ్‌లో భాగంగా 610 మీటర్ల నిడివితో 4, 5 ప్లాట్‌ ఫాంలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్‌, ప్లాట్‌ఫాం, తాగునీరు వంటి పనులు పూర్తయ్యాయి. గూడ్స్‌ రైళ్లను ఈ ప్లాట్‌ఫాంల గుండా నడిపిస్తున్నారు. అయితే, ప్రయా ణికులకు అవసరమైన పూర్తి స్థాయి సదుపాయాలు ఇంకా ఏర్పాటు కాలేదు. వెయిటింగ్‌ హాల్స్‌, ఎస్కలేటర్‌, టాయిలెట్స్‌ వంటి కనీస సౌకర్యాలూ లేవు. మరీ ముఖ్యంగా 610 మీటర్ల ప్లాట్‌ఫాంలపై ఎక్కడా షెడ్లు లేవు. వర్షం వచ్చినా, గట్టిగా ఎండ ఉన్నా నిలబడలేని దుస్థితి. ఇవన్నీ ఏర్పాటు కావాలంటే ఇంకా రూ.10 కోట్ల వరకూ నిధులు అవసరమవుతాయని తెలు స్తోంది. వీటిని కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించలేని సదరు ప్రజాప్రతినిధి నవం బరులో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. దీంతో ప్రయాణికులకు సదుపాయాలు లేకుండానే ప్రారంభో త్సవానికి పరుగులు పెడుతున్నారని తెలుస్తోంది. ఎన్‌ఎస్‌జీ-2 స్థాయి రైల్వే స్టేషన్‌లో ఇలాంటి పరిస్థితి వల్ల రైల్వేపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-10-27T00:10:51+05:30 IST