వేగంగా రోడ్ కం రైలు బ్రిడ్జి పనులు
ABN , First Publish Date - 2023-10-08T01:00:07+05:30 IST
రోడ్ కం రైలు బ్రిడ్జిపై జరుగుతున్న మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని కలెక్టర్ మాధవీలత తెలిపారు.
రాజమహేంద్రవరం,అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రోడ్ కం రైలు బ్రిడ్జిపై జరుగుతున్న మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని కలెక్టర్ మాధవీలత తెలిపారు. పనులను శనివారం పరిశీలించి మాట్లా డారు. తొలిదశలో మిల్లింగ్ మెషీన్‌తో తారురోడ్డును తొలగించే పనులు పూర్తి చేసినట్టు తెలిపారు.పాడైపోయిన సెకండరీ జాయింట్ల వద్ద గ్లాస్ జియో గ్రిడ్ షీట్లు వేసి వాటిపై 30ఎంఎం తారుతో లేయర్ వేయడం జరు గు తుందన్నారు.బ్రిడ్జిపై నీరు నిలవకుండా ఉండడానికి గ్లాస్ జియో గ్రిడ్‌తో పనులు చేస్తున్నారన్నారు.ఆమె వెంట ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.
సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష
బొమ్మూరు, అక్టోబరు 7: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అన్ని శాఖలతో సమన్వయం సాధించడం జరుగుతోందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ప్రధాన కార్యదర్శి జవహర్ న్యూఢిల్లీలో ఏపీ భవన్ నుంచి శనివారం పలు పథకాలపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్‌భరత్ పాల్గొన్నారు. జవహర్ మాట్లాడుతూ బంగారు కొండ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పోషక ఆహారం అందజేయడం వల్ల సత్ఫలితాలివ్వడంపై కలెక్టర్‌ను అభినందించారు. జూన్‌లో 383 మంది పిల్లలు సాధారణ స్థితికి వచ్చారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాంలో 8613 ఫిర్యాదుల్లో 7352 పరిష్కరించామన్నారు. కొవ్వూరు జగనన్న కాలనీలో అర్చి నిర్మాణం పూర్తి చేశామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 82 మెడికల్ క్యాంపులు నిర్వహించి 39,255 మందికి వైద్య సేవలందించామన్నారు. భేటీ బచావో, భేటీ పడావోలో 683 మంది బాలికలను పాఠశాలలో జాయిన్ చేశామని తెలిపారు. జిల్లాలో 8423 మంది గర్భిణులకు 5549 మందికి పరీక్షలు నిర్వహించగా 1003 మంది రక్తహీనత ఉన్నవారిని గుర్తించి పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం బంగారు కొండ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.