సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2023-01-14T00:08:11+05:30 IST

రాజమహేంద్రవరం మునిసిపల్‌ స్టేడియంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

సంక్రాంతి సంబరాలు
కోలాటం ఆడుతున్న కలెక్టర్‌ మాధవీలత, మంత్రి వనిత తదితరులు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 13 : రాజమహేంద్రవరం మునిసిపల్‌ స్టేడియంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ , రాష్ట్ర హోమంత్రి తానేటి వనిత, కలెక్టర్‌ డాక్టర్‌ కే మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు , జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌, కమిషనర్‌ కె దినేష్‌ కుమార్‌, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి పాల్గొన్నారు. భోగిమంటలు అంటించారు. కోలాటం ఆడారు, గంగిరెద్దులు, హరిదాసులు, కొమ్మదాసరిలతో సందడి చేశారు. పిండివంటలు చేశారు. కార్యక్రమంలో ఖాదిబోర్డు చైర్‌పర్సన్‌ పిల్లి నిర్మల , శెట్టిబలిజ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాలిక శ్రీను , గుర్రం గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-14T00:08:30+05:30 IST