రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన
ABN , First Publish Date - 2023-10-06T01:28:21+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన నడుస్తోందని, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణచౌదరి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజానగరంలో గురువారం నిరాహార దీక్ష చేపట్టారు.
టీడీపీ రాజానగరం ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణచౌదరి
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ నిరాహార దీక్ష
రాజానగరం, అక్టోబరు 5: రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన నడుస్తోందని, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణచౌదరి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజానగరంలో గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నా రన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజక వర్గ ఉపాధ్యక్షుడు గంగిశెట్టి చంటిబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందుల బాబూరాయుడు, నీలపాల అరవరాజు, బత్తుల త్రిమూ ర్తులు, మద్ది రెడ్డి చిన వెంకటేశ్వరరావు, తనకాల నాగేశ్వరరావు, సంగీత సత్తిబాబు, ఖండ విల్లి లక్ష్మి, నూనె వెంకన్న, గొల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు.