TDP: మంత్రి జోగి రమేష్‌కు టీడీపీ నేత కౌంటర్...

ABN , First Publish Date - 2023-05-27T14:57:13+05:30 IST

మంత్రి జోగి రమేష్‌కు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్ ఇచ్చారు. శనివారం రాజమండ్రిలోని మహానాడులో ఆయన మాట్లాడుతూ సీఎం జగనుకు కూడా వైఎస్ వివేకా హత్యలో పాత్ర ఉందని సీబీఐ చెప్పలేదా..?

TDP: మంత్రి జోగి రమేష్‌కు టీడీపీ నేత కౌంటర్...

రాజమండ్రి: మంత్రి జోగి రమేష్‌ (Minister Jogi Ramesh)కు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) కౌంటర్ ఇచ్చారు. శనివారం రాజమండ్రిలోని మహానాడులో ఆయన మాట్లాడుతూ సీఎం జగనుకు కూడా వైఎస్ వివేకా హత్యలో పాత్ర ఉందని సీబీఐ చెప్పలేదా..?.. పదవి నుంచి దింపడమే తప్పయితే సొంత చిన్నాన్నను చంపిన వారిని ఏమనాలి?.. దీనికి జోగి రమేష్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వివేకా హత్య విషయంలో జగన్ వైఎస్ సమాధి వద్దకెళ్లి క్షమాపణ చెప్పాలన్నారు. చిన్నాన్నను చంపిన దుర్మార్గుడు జగన్ అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేశారని.. ఇదేనా మేనిఫెస్టోని అమలు చేయడం అంటూ బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో పెట్టారని.. ఆ ఇళ్లు ఏమయ్యాయని నిలదీశారు. మహానాడు జరుగుతుంటే ఓర్వలేక జోగి రమేష్‌ను ఉసిగొల్పారని, బీసీ అయిన జోగి రమేష్ గౌరవంగా బతకాలని సూచించారు. జోగి రమేష్.. జగన్ వద్ద బంట్రోతు ఉద్యోగం చేయొద్దని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

Updated Date - 2023-05-27T14:57:13+05:30 IST