టీడీపీతోనే భవిష్యత్తు గ్యారంటీ
ABN , First Publish Date - 2023-07-24T00:30:41+05:30 IST
తునిరూరల్, జూలై 23: భవిష్యత్తు గ్యారంటీ ఒక టీడీపీతోనే సాధ్యమని తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. తాటికొండ శివారు వెంకటా పురం గ్రామంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడుతో కలిసి పర్యటించారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు హ
తునిరూరల్, జూలై 23: భవిష్యత్తు గ్యారంటీ ఒక టీడీపీతోనే సాధ్యమని తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. తాటికొండ శివారు వెంకటా పురం గ్రామంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడుతో కలిసి పర్యటించారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు హయంలోనే గ్రామాలు అభివృద్ధి చెందా యన్నారు. వైసీపీ పాలనంతా అవినీతిమయమని వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, యనమల శివరామకృష్ణ, ఎన్.సురవరం, మాజీ సర్పంచ్ చింతమనే డి నాగసోమరాజు(అబ్బాయి), కలగా శ్రీనుబాబు, గొల్లపల్లి రాంబాబు, చిరంజీవి రాజ, ఖాతా గోవిందు పాల్గొన్నారు.