దోచేస్తున్న అదానీ, అంబానీ

ABN , First Publish Date - 2023-03-24T01:01:21+05:30 IST

దేశ సంపదను మోదీ, అమిత్‌షా అమ్మేస్తుంటే.. అదానీ, అంబానీ కొనేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ స్పష్టం చేశారు.

దోచేస్తున్న అదానీ, అంబానీ
అదానీ ముప్పు పుస్తకావిష్కరణలో ఉండవల్లి అరుణకుమార్‌ తదితరులు

రాజమహేంద్రవరం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : దేశ సంపదను మోదీ, అమిత్‌షా అమ్మేస్తుంటే.. అదానీ, అంబానీ కొనేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రచురించిన దేశానికి అదానీ ముప్పు అనే పుస్తకాన్ని రాజమహేంద్రవరం ధర్మంచర హాల్‌లో గురువారం ఆవిష్కరించారు. అదానీ ఆస్తులు గత ఎనిమిదేళ్లలో ఎలా పెరిగాయో అనే విషయాన్ని హెడెన్‌బర్గ్‌ నివేదిక ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిందన్నారు. హిడెన్‌బర్డ్‌ నివేదికపై పార్లమెంట్‌లో కనీసం చర్చ కూడా జరగలేదు. దీనిని బట్టి మోదీ, అదానీ వేర్వేరు కాదని.. ఇద్దరూ కలసి మోదానీ అని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా గురువారం నుంచి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.

Updated Date - 2023-03-24T01:01:21+05:30 IST