Jawahar : అప్పుడు చొక్కా విప్పితే బాగుండేది..
ABN , First Publish Date - 2023-04-22T08:59:48+05:30 IST
ఆదిమూలపు సురేష్ చర్యలు మాదిగ జాతికి తలవంపులు తెస్తున్నాయని మాజీ మంత్రి జవహర్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సురేష్ ఏనాడైనా దళితుల గురించి పోరాడాడా? అని ప్రశ్నించారు.
అమరావతి : ఆదిమూలపు సురేష్ చర్యలు మాదిగ జాతికి తలవంపులు తెస్తున్నాయని మాజీ మంత్రి జవహర్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సురేష్ ఏనాడైనా దళితుల గురించి పోరాడాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే కనీసం పట్టించుకోని సురేష్‌కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అర్ధ నగ్న ప్రదర్శన చేయాల్సంది తాడేపల్లి ప్యాలెస్ ముందు అని పేర్కొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం పోయినపుడు చొక్కా విప్పితే బాగుండేదన్నారు. దుర్గి, నెల్లూరు లిడ్ కాప్ భూములు అన్యక్రాంతం అయినప్పుడు సురేష్ ఎక్కడున్నాడని జవహర్ ప్రశ్నించారు. మలుపు, ముందడుగు పథకాలు కనుమరుగైనపుడు ఏమయ్యాడని నిలదీశారు. ఇంకా జవహర్ మాట్లాడుతూ.. ‘‘వరప్రసాద్ శిరోముండనపుడు సురేష్ ఏ కలుగులో దక్కున్నాడు? నీ ప్రాంతంలో దళితులకు నీవేం చేశావో చెప్పాలి. దళిత బాంధవుడు చంద్రబాబుని అనే అర్హత నీకు లేదు. డాక్టర్ సుధాకర్ మరణం, సుబ్రహ్మణ్యం మరణం నీకు కనిపించ లేదా? సురేష్ జాతి ద్రోహి దళితులకు చేసిందేమి లేదు. సురేష్ చర్యలను ప్రతి దళితుడు వ్యతిరేకించాలి’’ అని పేర్కొన్నారు.