AP News: కోడి కనపడటం లేదని అడిగినందుకు ఓ వృద్ధురాలిని...

ABN , First Publish Date - 2023-08-08T12:16:40+05:30 IST

తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోడి కనబడకపోవడంతో ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది.

AP News: కోడి కనపడటం లేదని అడిగినందుకు ఓ వృద్ధురాలిని...

ఏలూరు: తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోడి కనబడకపోవడంతో ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది. తమ కోడి కనపబడిందా అంటూ సమీపంలో నివసిస్తున్న కుటుంబసభ్యులను వృద్ధురాలు ప్రశ్నించింది. అంతే.. ఆ కుటుంబసభ్యులు వృద్ధురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇంట్లో పెంచుకుంటున్న కోడి కనపడటం లేదని అడిగినందుకు వృద్దురాలు లూర్ధమ్మపై దాడికి తెగబడ్డారు కొందరు వ్యక్తులు. జిల్లాలోని చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామంలో పూరి గుడిసెలో వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు. తమ పెంపుడు కోడి ఇంటి పరిసరాలలో కనిపించకపోవడంతో సమీపంలో నివసిస్తున్న ఇంటి కుటుంబసభ్యులను వృద్ధురాలు అడిగింది. అయితే దొంగతనం నేపాన్ని తమపై మోపిందని భావించిన సదరు కుటుంబసభ్యులు వృద్ధురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా.. వృద్ధురాలు అని చూడకుండా లూర్ధమ్మను మహిళ, ఆమె భర్త కలిసి తీవ్రంగా కాళ్ళతో కొట్టి, రోడ్డుపై ఇడ్చుకెళ్ళి పడేశారు. సమాచారం తెలుసుకున్న వృద్ధురాలి బంధువులు వెంటనే అక్కడకు చేరుకుని తీవ్రగాయాలతో రోడ్డుపై పడిఉన్న వృద్దురాలిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-08T12:16:40+05:30 IST