Share News

Road Accident: ప్రకాశం జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Dec 22 , 2023 | 04:55 PM

పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తూ కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి

Road Accident: ప్రకాశం జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తూ కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 04:57 PM