Laxminarayana: ‘జై భారత్ నేషనల్ పార్టీ’ని స్థాపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ABN , Publish Date - Dec 22 , 2023 | 08:27 PM
కొత్త పార్టీని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీని జేడీ ప్రారంభించారు.
విజయవాడ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. ‘జై భారత్ నేషనల్ పార్టీ’ని స్థాపించారు. ‘‘ సుపరిపాలన కోసమే ‘జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేశాము. రాజకీయాలంటే సుపరిపాలన అని నిరూపిస్తాం. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. వీళ్లు తిన్నారని వాళ్లు,.. వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శిస్తున్నారు. అవినీతిని అంతమొందించేందుకే వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుంది. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలే నేర్పిస్తుంది. కుటుంబపాలన చుట్టూతే రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి" అని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.