Chintamohan: షర్మిలను ఆహ్వానిస్తున్నాం

ABN , First Publish Date - 2023-07-10T10:41:25+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిన్న మాట అన్నదానికి రెండేళ్లు జైలు శిక్ష ఎలా వేస్తారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chintamohan: షర్మిలను ఆహ్వానిస్తున్నాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చిన్న మాట అన్నదానికి రెండేళ్లు జైలు శిక్ష ఎలా వేస్తారని మాజీ ఎంపీ చింతామోహన్(Former MP Chintamohan) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీ‌కి ఇచ్చిన తీర్పు కూడా అంత ఆశజనకంగా లేదన్నారు. చిన్న మాట అంటేనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) చిన్నాన్న చనిపోయి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు ఎవరికీ శిక్ష పడలేదన్నారు. అందరికీ సమన్యాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై సీబీఐ, ఈడీ కేసులు పెడతారన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు అన్నీ కూడా ప్రధాని మోడీ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, నిత్యవసర ధరలు పెంచుకుంటూ ప్రధాని వెళ్తున్నారన్నారు. దేశ ప్రధాని ఒక రాష్ట్రంలో అవినీతి జరిగిందని చెప్పడం బాధాకరమని.. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో బీజేపీ సాధించినది శూన్యమని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే వైసీపీకి 20 సీట్లు కంటే ఎక్కువగా రావడం కూడా కష్టమే అన్నారు. పవన్‌ను చూస్తే జాలి వేస్తుందని... పవన్ కళ్యాణ్ యాత్ర థీమ్ లేకుండా రాజకీయాల్లోకి రావడం, సందేశం లేని సినిమాలా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశానికి రక్ష అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాల్లో 15 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలను శాసించబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దళితులు డిసైడ్ చేయబోతున్నారన్నారు. పేదవాళ్ళకి న్యాయస్థానాల్లో న్యాయం జరగడం లేదని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మారిపోయిందని విమర్శించారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నామని... కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చింతామోహన్ వెల్లడించారు.

Updated Date - 2023-07-10T10:41:25+05:30 IST