Share News

Chintamohan: చంద్రబాబుపై కేసు నమోదు తప్పు

ABN , First Publish Date - 2023-10-16T11:42:10+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు తప్పు అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు.

Chintamohan: చంద్రబాబుపై కేసు నమోదు తప్పు

న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandrababu Naidu) కేసు నమోదు తప్పు అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ (Former Union Minister Chinta Mohan) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చాలా మంచివారని.. వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబును తక్షణం జైలులో నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పు చేసినట్లు రుజువులు ఉన్నాయా? కేవలం ఆయనపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ 2005లో రాజ్యంగ సవరణ ద్వారా చట్టం చేసి 27శాతం రిజర్వేషన్లను ఇచ్చిందని తెలిపారు. 75 సంవత్సరాల్లో ఓబీసీలు రాజకీయంగా ముందుకు వెళ్లలేదని... ఓబీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ లాగా చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారన్నారు. 37 రోజులుగా జైలులో పెట్టడం తప్పు అని చెప్పుకొచ్చారు. వాజ్ పాయ్, పీవీ నరసింహారావు కుట్రల ఫలితంగా అప్పట్లో అద్వానీపై కేసులు పెట్టారని.. దాని ఫలితంగా ఆయన ఇప్పటికీ ప్రధాని కాలేకపోయారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రోబోతుందని... తెలంగాణలో 75 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ- జనసేన పొత్తును ఆహ్వానిస్తున్నామన్నారు. 10 నుంచి 15 శాతం ఓటు బ్యాంకు ఏపీలో కాంగ్రెస్‌కు పెరిగిందన్నారు. తమ పార్టీతో కలసిన వారు తప్పకుండా అధికారంలోకి వస్తారని చింతామోహన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-16T11:43:15+05:30 IST