Gouthu Sireesha: చేయూత పేరుతో జగన్ చేతివాటం నిజం కాదా?
ABN , First Publish Date - 2023-08-11T19:07:22+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ ప్రధాన కార్యదర్శి గైతు శిరీష (Gouthu Sireesha) విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ ప్రధాన కార్యదర్శి గైతు శిరీష (Gouthu Sireesha) విమర్శలు గుప్పించారు.
"సంక్షేమం అమలులో జగన్ రెడ్డి మాటలు కొండంత -చేతలు గోరంత. సున్నా వడ్డీ పథకాన్ని తానే ప్రవేశపెట్టినట్టు జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సున్నా వడ్డీ రాయితీ రూ. 3 లక్షలకు కుదించిన జగన్ రెడ్డి సంక్షేమం గురించి మాట్లాడటమా?. ఆసరా కింద రుణమాఫీ చేస్తానని ఆచరణలో మొండిచేయి చూపింది వాస్తవం కాదా?. చేయూత పేరుతో జగన్ రెడ్డి చేతివాటం ప్రదర్శించింది నిజం కాదా?. నాలుగేళ్లలో డ్వాక్రాను నిర్వీర్యం చేసింది జగన్ రెడ్డి కాదా?. అభయహస్తం నిధులు కాజేసి, స్త్రీ నిధి పథకం నిలిపేసింది జగన్ రెడ్డి కాదా?. మహిళా సంక్షేమానికి నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనే. డ్వాక్రాను తీసుకొచ్చి మహిళల ఆర్థిక చేయూత అందించింది చంద్రన్నే." అని గైతు శిరీష అన్నారు.