Gudivada Amarnath: చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-09T15:52:20+05:30 IST

చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే పది, పన్నెండు సెక్షన్లు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుకి అవినీతిలో స్కిల్ ఉంది.. ఈ కేసుతో సంబంధం లేదని ఆయన ఎపుడూ చెప్పలేదు. ఈ స్కాంలో ఎంత మంది పాత్రధారులు ఉన్నా... సూత్రధారి బాబే. చంద్రబాబు చంద్రమండలంలో ఉన్నా... జైలుకి వెళ్లక తప్పదు. బాబు చేసిన తప్పులకు శిక్ష తప్పదు..

Gudivada Amarnath: చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

విశాఖ: ప్రజల ధనానికి రక్షణగా ఉండాల్సిన అప్పటి సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ చేశారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్‌పై (Chandrababu arrest) మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే పది, పన్నెండు సెక్షన్లు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుకి అవినీతిలో స్కిల్ ఉంది.. ఈ కేసుతో సంబంధం లేదని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఈ స్కాంలో ఎంత మంది పాత్రధారులు ఉన్నా... సూత్రధారి బాబే. చంద్రబాబు చంద్రమండలంలో ఉన్నా... జైలుకి వెళ్లక తప్పదు. బాబు చేసిన తప్పులకు శిక్ష తప్పదు.. కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. చట్టం నుంచి తప్పించుకోలేరు. నైపుణ్య అభివృద్ధి సంస్థ పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు పాలన అంతా కుంభకోణాలే. బాబు అవినీతిపై ఆయనతో ఉన్న పవన్, వామపక్ష నేతలు ఏం సమాధానం చెబుతారు?, చంద్రబాబుని అరెస్టు చేస్తే లోకేష్ (Nara lokesh) వాకింగ్ దగ్గర.. పవన్ (pawan kalyan) షూటింగ్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. మరిది గారిని మళ్లీ సీఎం చేయాలని పురంధేశ్వరి (Daggubati Purandeswari) చూస్తున్నారు. బాబు అరెస్టును ఖండిస్తున్నారంటే.. మీ వాటా ఎంతో పురంధేశ్వరి చెప్పాలి. బాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ప్రజల్లో ఎలా తిరుగుతారు?, చంద్రబాబు పాపాలకు సమయం వచ్చింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు అరెస్టుకు శనివారం, ఆదివారంతో సంబంధం ఏమిటి?, చంద్రబాబు అరెస్టు చేయాలన్న తాపత్రయం లేదు.. అలా అయితే ఎప్పుడో చేసేవాళ్ళం. కోడ్ లాంగ్వేజ్‌లో డబ్బులు కొట్టేశారు. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. వీటి మీద ఆయన పార్ట్‌నర్స్ స్పందించాలి. బాబు అరెస్టును రాజకీయకోణంలో చూడవద్దు.’’ అని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-09T15:54:30+05:30 IST