అర్హులకు తప్పనిసరిగా సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2023-01-01T01:49:11+05:30 IST
పట్టణంలోని 24వ వార్డు సిద్దయ్య తోటలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు, అధికారులతో కలసి విస్తృతంగా పర్యటించారు.
24వ వార్డులో పర్యటిస్తున్న మంత్రి రజిని
చిలకలూరిపేట, డిసెంబరు 31 : పట్టణంలోని 24వ వార్డు సిద్దయ్య తోటలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు, అధికారులతో కలసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు ఉన్న కరపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు తప్పక అందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన షేక్ రఫానీ, 24వ వార్డు కౌన్సిలర్ షేక్ కరిముల్లా, వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు తలహాఖాన, విడదల గోపీ, తోట రామచంద్ర ప్రసాదు, తోట రాజేంద్ర ప్రసాదు పాల్గొన్నారు.