బీజేపీ అంటే... బాబు, జగన్‌, పవన్‌:పీసీసీ

ABN , First Publish Date - 2023-07-04T03:59:00+05:30 IST

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంటే... బాబు, జగన్‌, పవన్‌. ఆ మూడు పార్టీలూ బీజేపీకి దాసోహమంటున్నాయి.

బీజేపీ అంటే... బాబు, జగన్‌, పవన్‌:పీసీసీ

అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘‘భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంటే... బాబు, జగన్‌, పవన్‌. ఆ మూడు పార్టీలూ బీజేపీకి దాసోహమంటున్నాయి. అవి బీజేపీ బీ టీమ్‌ పార్టీలు’’ అని ఏపీకాంగ్రెస్‌ కమిటీ ఆరోపించింది. ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు మోదీ సర్కారు కార్యాచరణను సిద్ధం చేసినా... రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్‌, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకించడం లేదు’’ అని మండిపడ్డారు.


Updated Date - 2023-07-04T03:59:00+05:30 IST