కోటప్పకొండలో పర్యాటక అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2023-01-05T00:09:04+05:30 IST
ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ శివశంకర్ తెలిపారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో కలెక్టర్ శివశంకర్
నరసరావుపేట రూరల్, జనవరి 4: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కోటప్పకొండ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం పరిశీలించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మెట్లమార్గాన ఏపీ టూరిజం ఎమ్యూజ్‌మెంట్ పార్కులో యాంప్టీ థియేటర్ స్టేజ్ కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం ఫిబ్రవరి 18న జరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణ కోసం రూ.7 లక్షలతో స్టేజీ నిర్మాణానికి సహకరించిన కపలవాయి విజయకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీకెండ్‌లో జలవిహార్‌లో రెండు సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుతో పాటు రోజూ బోటింగ్ ఏర్పాటు చేశామన్నారు.