Pawan Kalyan: ఏపీలో బతకాలంటే చాలా కష్టం.. రాష్ట్రంలో కౌన్సిలర్ కూడా బెదిరిస్తాడు
ABN , First Publish Date - 2023-08-05T15:49:27+05:30 IST
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి తెలిసిన పోలీస్ అధికారైనా ఉండాలి..లేదా ఎమ్మెల్యే సొంత కులం అయినా ఉండాలి..ఇక్కడ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరిస్తాడని జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు.
అమరావతి(Amaravati): ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి తెలిసిన పోలీస్ అధికారైనా ఉండాలి..లేదా ఎమ్మెల్యే సొంత కులం అయినా ఉండాలి..ఇక్కడ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరిస్తాడని జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం గల్ఫ్(Gulf) ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎక్కడో గల్ఫ్ దేశాలకు వెళ్లి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు.. ఏపీలో ఆ పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి ఉందన్నారు.
YuvaGalam: టీడీపీ హయాంలోనే ఎస్టీల అభివృద్ధి.. లంబాడీ వర్గీయుల సమావేశంలో లోకేశ్
గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం ఇక్కడ ఎందుకు బతకాలంటే కష్టంగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయి.. విదేశాల్లో ఉన్న సౌకర్యాలు, రూల్ ఆఫ్ లా ఇక్కడికి తీసుకురావాలన్నారు. ప్రతీ ఒక్కరూ ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. జనసేనను బాధ్యతగా ఉండి జవాబు దారి తనంతో ముందుకు తీసుకువెళ్తానని.. అవినీతి రహిత రాజకీయాలే తన లక్ష్యమని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు.. ప్రభుత్వాన్నీ నిలదిస్తున్న పవన్‌పై గల్ఫ్ ప్రతినిధులు ప్రసంశలు కురిపించారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రతినిధులు జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం అందజేశారు. గల్ఫ్ ప్రతినిధుల అవసరం చాలా ముఖ్యం.. మీరు అందించిన మద్దతుకి రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు.