కోలాహలంగా ఎడ్ల పందేలు

ABN , First Publish Date - 2023-02-13T00:42:57+05:30 IST

మండలంలోని సత్రశాల భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రంలో జరుగుతున్న ఎడ్ల పందేలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పందేల అనంతరం జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ శొంఠిరెడ్డి నర్శిరెడ్డి పాల్గొన్నారు.

కోలాహలంగా ఎడ్ల పందేలు
ఎడ్ల పోటీలను ప్రారంభిస్తున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.నర్శిరెడ్డి

రెంటచింతల, ఫిబ్రవరి 12: మండలంలోని సత్రశాల భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రంలో జరుగుతున్న ఎడ్ల పందేలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పందేల అనంతరం జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ శొంఠిరెడ్డి నర్శిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శొంఠిరెడ్డి మాట్లాడుతూ నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి ఒంగోలు జాతి పశువులకు పెట్టింది పేరన్నారు. ఒంగోలు జాతి పేరు వినగానే ఆంధ్రుల మది స్వాభిమానంతో ఉప్పొంగుతుందన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం సత్రశాల భక్త మల్లారెడ్డి అన్నదాన సత్రంలో రెండుపళ్ల విభాగానికి సంబంధించి పోటీలను ప్రారంభించారు.

రెండుపళ్ల విభాగంలో ప్రత్తిపాడు జతకు ప్రథమస్థానం

రెండుపళ్ల విభాగంలో ప్రత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్య చౌదరి, గోళ్లమూడిపాడుకు చెందిన ఉప్పాళ్ల లక్ష్మయ్య చౌదరి కంబైన్డ్‌ ఎడ్ల జత 4437.4 అడుగుల దూరం లాగి ప్రఽథమస్థానంలో నిలిచింది. కెంపల్లి కృష్ణాజిల్లాకు చెందిన జొన్నలగడ్డ దేవతాతారావు ఎడ్లజత 4372.08 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, రామిరెడ్డి దామోదరరెడ్డి కామేపల్లి ఖమ్మం జిల్లా,బాలసైద పిన్నెల్లికి చెందిన కంబైన్డ్‌ ఎడ్లజత 4178.3 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, కల్లూరి ప్రసాద్‌ గరికపూడి, ప్రత్తిపాడు చెందిన ఎడ్ల జత 4087 అడుగుల దూరం లాగి నాల్గో స్థానం, జీపీ చౌదరి, సిద్దంశెట్టి సామ్రాజ్యం పాతమల్లాయపాలెంకు చెందిన ఎడ్లజత 4051.9 అడుగుల దూరం లాగి ఐదో స్థానం, ఉప్పల లక్ష్మయ్య చౌదరి, గోళ్లమూడిపాడు రామినేని రత్తయ్య చౌదరి తోటపాలెంకు చెందిన ఎడ్ల జత 3600 అడుగుల దూరం లాగి 6వ బహుమతిని దక్కించుకున్నాయి. పోటీలను తిలకించడానికి జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

Updated Date - 2023-02-13T00:43:00+05:30 IST