సచివాలయ సెక్షన్‌అధికారి విజయలక్ష్మి డిస్మిస్
ABN , First Publish Date - 2023-02-01T03:49:25+05:30 IST
అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఒకప్పటి సెక్షన్ అధికారి, ప్రస్తుత యువజన సర్వీసుల శాఖ సెక్షన్ అధికారి (వైఏటీ అండ్ సీ) ఆర్కే విజయలక్ష్మిని డిస్మిస్ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లంచం కేసులో జైలు శిక్ష వేసిన కోర్టు.. ఉద్యోగం నుంచి తొలగింపు
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఒకప్పటి సెక్షన్ అధికారి, ప్రస్తుత యువజన సర్వీసుల శాఖ సెక్షన్ అధికారి (వైఏటీ అండ్ సీ) ఆర్కే విజయలక్ష్మిని డిస్మిస్ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 2010 సెప్టెంబరులో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించడంతో.. విజయలక్ష్మిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.