Vangaveeti Radha Krishna: పేదలకు రంగా ఆరాధ్య దైవం అయ్యారంటే కారణమిదే..!
ABN , First Publish Date - 2023-07-04T17:20:52+05:30 IST
ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని వర్గాల వారికి వంగవీటి మోహనరంగా అండగా నిలిచారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. పాతురులో రంగా విగ్రహావిష్కరణలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. పాతూరులో తన తండ్రి, పెదనాన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్‌కే సహకారం అందించారని వెల్లడించారు. ఒక నాయకుడు మరణించి మూడు దశాబ్దాలు దాటినా స్మరిస్తూనే ఉన్నారని.. తనది మానవ కులం అని చాటి చెప్పిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని గుర్తుచేశారు.
అమరావతి: ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని వర్గాల వారికి వంగవీటి మోహనరంగా అండగా నిలిచారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) తెలిపారు. పాతురులో రంగా విగ్రహావిష్కరణలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. పాతూరులో తన తండ్రి, పెదనాన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్‌కే సహకారం అందించారని వెల్లడించారు. ఒక నాయకుడు మరణించి మూడు దశాబ్దాలు దాటినా స్మరిస్తూనే ఉన్నారని.. తనది మానవ కులం అని చాటి చెప్పిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని గుర్తుచేశారు. విగ్రహాలు ఏర్పాటు చేశారంటే.. వారిని చూసి మనం స్ఫూర్తి పొందాలన్నారు. పెద్దనాన్న కూడా పేదలకు అండగా ఉన్నారని.. రాజకీయాల్లో లేకున్నా బడుగులకు భరోసా ఇచ్చారని చెప్పుకొచ్చారు. చేయి చేయి కలుపు.. చేజారదు గెలుపు అని ఆనాడే పిలుపునిచ్చారని పేర్కొన్నారు. పెద్దనాన్న బాటలోనే తండ్రి రంగా కూడా పయనించి పేదలకు ఆరాధ్య దైవం అయ్యారని.. నేడు పార్టీలకు అతీతంగా అందరూ తన తండ్రిని స్మరిస్తున్నారంటే ఆయన గొప్పతనం అందరూ తెలుసుకోవాలని రాధాకృష్ణ సూచించారు.