తిరుమలలో రౌడీషీటర్ల ఓట్లు తొలగించాలి

ABN , First Publish Date - 2023-03-11T03:27:58+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుమల కొండపై ఇద్దరు రౌడీషీటర్లకు పట్టభద్రుల ఓటు నమోదు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర చీఫ్‌ ఎలకో్ట్రరల్‌ ఆఫీసర్‌ ముఖే్‌షకుమార్‌ మీనాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

తిరుమలలో రౌడీషీటర్ల ఓట్లు తొలగించాలి

అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుమల కొండపై ఇద్దరు రౌడీషీటర్లకు పట్టభద్రుల ఓటు నమోదు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర చీఫ్‌ ఎలకో్ట్రరల్‌ ఆఫీసర్‌ ముఖే్‌షకుమార్‌ మీనాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తిరుమలలో పోలింగ్‌ బూత్‌ నం.230లో వరుస నంబరు 408, 490లలో బెల్లం రమేష్‌, సోమశేఖర్‌ల పేర్లతో పట్టభద్రుల ఓట్లు నమోదైనట్లు తిరుపతి సీఐటీయూ పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. ఒకరు ఐదో తరగతి, మరొకరు 10వ తరగతి కూడా పూర్తి చేయలేదని, కానీ వారిద్దరూ డిగ్రీ పూర్తి చేసినట్టుగా వారి ఫొటోలతో సహా ఓటరు లిస్టులో ముద్రించారంటూ ఆధారాలతోసహా సీఈవోకు లేఖ రాశారు. వారి ఓట్లు తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-11T03:27:58+05:30 IST