జడ్పీ ఆస్తుల రక్షణకు పటిష్ఠ చర్యలు

ABN , First Publish Date - 2023-02-24T00:21:29+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్‌ ఆస్తుల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, ఆదాయ వనరుల పెంపునకు కృషిచేయాలని రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇంజ నీరింగ్‌ అధికారులు, ఉద్యోగులును జడ్పీ చైర్‌ పర్సన్‌ కత్తెర హెని క్రిస్టిన ఆదేశించారు.

జడ్పీ ఆస్తుల రక్షణకు పటిష్ఠ చర్యలు
అధికారులతో సమీక్షిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ క్రిస్టిన

అధికారులతో జడ్పీ చైర్‌పర్సన్‌ హెని క్రిస్టిన

గుంటూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్‌ ఆస్తుల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, ఆదాయ వనరుల పెంపునకు కృషిచేయాలని రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇంజ నీరింగ్‌ అధికారులు, ఉద్యోగులును జడ్పీ చైర్‌ పర్సన్‌ కత్తెర హెని క్రిస్టిన ఆదేశించారు. జడ్పీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో గురు వారం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఆర్డీవోలు, పీఆర్‌ ఇంజనీ రింగ్‌ అధికారులతో సీఈవో మోహనరావు అధ్యక్షతన ఆమె సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ క్రిస్టిన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 57 మండలాల్లో జడ్పీ భూములు, స్థలాలు, షా పింగ్‌ కాంప్లెక్స్‌లు, అతిథి గృహాలు, ఇసుక రేవులు, బల్లకట్లు కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణల్లో ఉన్నాయని, వాటిని వెంటనే తొల గించాలని దేశించారు. అతిథిగృహాల నిర్వహణ జడ్పీకి భారమైందని, ఆదాయ వనరులను పెంచటానికి సమన్వయంగా పనిచేయాలన్నారు. సీఈవో మోహనరావు మాట్లాడుతూ జడ్పీ ఆస్తులపై బుక్‌ లెట్‌ వేశామని, దానిని ఆర్డీవోలు మండల స్థాయిలో తహసీల్దా రులు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించాలని కోరారు. సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్‌ అనురాధ, పీఆర్వోఎస్‌ఈ బ్రహ్మయ్య, ఆర్డీవోలు ఎం.శేషిరెడ్డి(నరసరావుపేట), కే.ఆదయ్య (గురజాల), ఎం.ప్రభాకర రెడ్డి (గుంటూరు) తదితరులు ప్రసంగించారు.

ఎంపీడీవోలు ప్రొటోకాల్‌ పాటించటం లేదు..

మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఎంపీడీవోలు ప్రొటోకాల్‌ పాటించటంలేదని జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెని క్రిస్టిన ఆవేదన వ్యక్తం చేశారు. మండల, జడ్పీ నిధులతో చేసే పనులకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలను ఆహ్వానించటం లేదని, దీనిపై అనేక ఆరోపణలు వస్తున్నట్లు తెలిపారు. జడ్పీ పాఠశాలల్లో అదనపు గదుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, నాడు-నేడు కార్యక్రమా లకు తనను సైతం ఆహ్వానిం చటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జడ్పీ సమావేశ హాల్లో సీఈవో మోహ నరావు అధ్యక్షతన ఆమె ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించారు. సీఈవో మోహ నరావు మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్‌ అనురాధ, ఏవో శ్రీనివాసరావు, జిల్లా పంచాయితీ వనరుల కో ఆర్డినే టర్‌ పద్మాకర్‌ తదితరులు ప్రసంగించారు.

మార్చి 3న జడ్పీ స్టాండింగ్‌ కమిటి సమావేశాలు ..

గుంటూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మార్చి 3న చైర్‌పర్సన్‌ కత్తెర హెని క్రిస్టిన అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఈవో మోహనరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వ రకు సమావేశాలు జరుగుతాయని, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆ సమావేశంలో పాల్గొంటారని సీఈవో మోహనరావు తెలిపారు.

Updated Date - 2023-02-24T00:21:57+05:30 IST