Share News

CBN: చంద్రబాబు హెల్త్‌ బులిటెన్ విడుదల

ABN , First Publish Date - 2023-10-12T21:39:29+05:30 IST

జమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ (Health bulletin) విడుదల చేశారు.

CBN: చంద్రబాబు హెల్త్‌ బులిటెన్ విడుదల

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ (Health bulletin) విడుదల చేశారు. చంద్రబాబుకు చర్మ సంబంధిత అస్వస్థతపై జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుకు అలర్జీ ఉందని వైద్యులు గుర్తించారని జైలు అధికారులు తెలిపారు. అలర్జీ సమస్య ఉందని ఆయన చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించామని, డాక్టర్లు పరీక్షలు చేసి ఓషధాలు సూచించారని, మందులను చంద్రబాబుకు అందిస్తాం డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తెలిపారు.

చంద్రబాబు ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా ఉండటంతో బాబు ఒక్కసారిగా డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ విషయంపై జైల్లో ఉన్న వైద్యాధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం బాబుకు పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అయితే.. గురువారం కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులు జైల్లో పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2023-10-12T23:32:35+05:30 IST