AP High Court: టెండర్లు ఫైనలైజ్ చేసినా నిధులు విడుదల చెయ్యొద్దు..
ABN , First Publish Date - 2023-12-13T12:43:15+05:30 IST
టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిధుల విడుదల నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి పరిశుభ్రత, తిరుపతి రహదారుల నిర్వహణ కోసం కార్పోరేషన్ నాలుగు టెండర్లు పిలిచింది. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
అమరావతి: టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిధుల విడుదల నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి పరిశుభ్రత, తిరుపతి రహదారుల నిర్వహణ కోసం కార్పోరేషన్ నాలుగు టెండర్లు పిలిచింది. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టులో పిల్ విచారణకు వచ్చింది. న్యాయవాది ఎలమంజుల బాలాజీ పిల్‌పై వాదనలు వినిపించారు.
టీటీడీ నుంచి నిధుల విడుదల అనేది దేవాదాయ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని బాలాజీ వాదించారు. టీటీడీ నిధులు భక్తుల సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి కోసమే వినియోగించాలని కోరారు. పిటిషనర్ బాలాజీ వాదనలు పరిగణలోనికి హైకోర్టు తీసుకుంది. టెండర్లు ఫైనలైజ్ చేసినా నిధులు విడుదల చెయ్యొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.