Iscon Rathayatra: విజయవాడలో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-24T14:19:19+05:30 IST

కుంభమేళా తర్వాత అత్యంత ప్రాచీన ఉత్సవం ఇస్కాన్ జగన్నాథ్ రథయాత్ర నగరంలో ఘనంగా ప్రారంభమైంది.

Iscon Rathayatra: విజయవాడలో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర ప్రారంభం

విజయవాడ: కుంభమేళా తర్వాత అత్యంత ప్రాచీన ఉత్సవం ఇస్కాన్ జగన్నాథ్ రథయాత్ర (Iscon Jannatha Rathayatra) నగరంలో ఘనంగా ప్రారంభమైంది. 70 దేశంలో 400 ఇస్కాన్ దేవాలయాలలో ఈ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథ రథయాత్రకు గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి రథోత్సవాన్ని గవర్నర్ ప్రారంభించారు. దేశం నలుములలో ఉన్న కళాకారులందరూ రథయాత్రలో పాల్గొని వివిధ విభిన్న నృత్యాలను రథయాత్రలో ప్రదర్శిస్తున్నారు. బందర్ రోడ్డులోని, డి అడ్రస్ మాల్ నుంచి మొదలైన యాత్ర... సుమారు 8 కిలోమీటర్ల మేరకు సాగనుంది. రథయాత్రలో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు రథయాత్ర మేళా కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు 50 వేల మంది భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని ఇస్కాన్ టెంపుల్ యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. రష్యా, అమెరికా, ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ రథయాత్రకు తరలివచ్చారు.విచ్చేశారు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి రథోత్సవాన్ని గవర్నర్ ప్రారంభించారు.

Updated Date - 2023-06-24T14:27:16+05:30 IST