JAC: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు

ABN , First Publish Date - 2023-02-28T19:34:26+05:30 IST

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ నోటీసును ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి (AP CS Jawahar Reddy) ఏపీ జేఏసీ నేతలు (AP JAC leaders) అందజేశారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ వివరాలు ఇలా ఉన్నాయి.

JAC: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు

అమరావతి: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ నోటీసును ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి (AP CS Jawahar Reddy) ఏపీ జేఏసీ నేతలు (AP JAC leaders) అందజేశారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 9, 10 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన, 13, 14 తేదీల్లో భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసనలు, 15, 17, 20 తేదీల్లో జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్‌ల దగ్గర ధర్నాలు, 21 నుంచి వర్క్‌టూ రూల్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయనున్నారు. మార్చ్ 21న సెల్‌డౌన్‌, యాప్‌డౌన్, 24 నుంచి అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ధర్నాలు, 27న కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పు కార్యక్రమం ఉంటుందని జేఏసీ నేతలు తెలిపారు. సరెండర్ లీవ్‌లు, ఎర్న లీవ్‌లు, జీపీఎఫ్‌ల విషయంలో ఏప్రిల్‌ 1న పోలీసు కుటుంబాల ఇళ్ళకు తిరుగుతామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు తెలిపారు. కలెక్టరేట్‌లకు వెళ్ళి గ్రీవెన్స్ నిర్వహిస్తామని, ఏప్రిల్‌ 5న ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, రెండోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు పేర్కొన్నారు.

కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వలేదని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రభుత్వం నుంచి పాల వాడి దాకా ఉద్యోగులను అవహేళన చేస్తున్నారని బొప్పరాజు మండిపడ్డారు. 62 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు పెంపును ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు అమలు చేయడం లేదని బొప్పరాజు ఆరోపించారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఉద్యమ కార్యచరణపై ఆలోచిస్తామని, ఈసారి చాయ్ బిస్కెట్స్ సమావేశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని బొప్పరాజు స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌తో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా?: సోమిరెడ్డి

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు

Updated Date - 2023-02-28T19:42:25+05:30 IST