LokeshPadayatra: యువగళం దెబ్బకు జగన్ మైండ్ బ్లాంక్ అయింది: లోకేష్
ABN , First Publish Date - 2023-03-19T21:44:25+05:30 IST
యువగళం దెబ్బకు సీఎం జగన్ (CM Jagan) మైండ్ బ్లాంక్ అయిందని, ఆయనకు భయాన్ని పరిచయం చేశామని టీడీపీ నేత లోకేష్ (NaraLokesh) ప్రకటించారు.
శ్రీసత్యసాయి: యువగళం దెబ్బకు సీఎం జగన్ (CM Jagan) మైండ్ బ్లాంక్ అయిందని, ఆయనకు భయాన్ని పరిచయం చేశామని టీడీపీ నేత లోకేష్ (NaraLokesh) ప్రకటించారు. టీడీపీ వచ్చాక కదిరిని అభివృద్ధి చేస్తామని, కదిరిలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేసి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో లోకేష్ మాట్లాడుతూ 2024లో సైకిల్ క్లీన్‌స్వీప్, ఫ్యాన్ సింగిల్ డిజిట్ ఖాయమని జోస్యం చెప్పారు. 175 నియోజకవర్గాలు జగన్‌ను బైబై అంటున్నాయని, ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ను మిస్‌యూజ్ చేసుకున్నారని ఎద్దేవాచేశారు.
‘‘3 రాజధానులు అంటూ మాయ చేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. ఇప్పుడు 3 ప్రాంతాల ప్రజలు జగన్‌కు 3 మొట్టికాయలు వేశారు. కొత్త కంపెనీలు తేకపోగా పీపీఏలు రద్దు చేసి ఉన్న సంస్థలను తరిమేశారు. మన ఫెయిల్డ్ సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధిని కాకుండా..కక్ష సాధింపులను ఎజెండాగా పెట్టుకున్నారు. అన్ని రంగాలను ఫెయిల్డ్ సీఎం మోసం చేశారు’’ అని లోకేష్ దుయ్యబట్టారు.