Pawan Delhi Tour: జగన్ కలిసొచ్చిన కొద్దిరోజులకే ఢిల్లీకి పవన్..!

ABN , First Publish Date - 2023-04-03T12:28:09+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

Pawan Delhi Tour: జగన్ కలిసొచ్చిన కొద్దిరోజులకే ఢిల్లీకి పవన్..!

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ (Janasen Chief Pawan Kalyan)) ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న పవన్ .. ఈరోజు కేంద్రమంత్రి అమిత్‌ షా (Union Minister Amith shah), జేపీ నడ్డా (JP Nadda)లతో సమావేశంకానున్నారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) ఉన్నారు. పవన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను తీసుకువచ్చింది. గతంలో బీజేపీ (BJP)తో కలిసి పనిచేస్తామని పవన్ చెప్పిన తర్వాత.. జగన్‌పై ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై రోడ్‌‌మ్యాప్ ఇస్తామని బీజేపీ అధిష్టానం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఏం చేయాలనే దానిపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదని పవన్ చెప్పుకొచ్చారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోరాటం చేయాలంటూ పార్టీ నేతలు కోరుతున్న నేపథ్యంలో బీజేపీతో ఉన్న బంధంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు అమిత్‌షా, జేపీ నడ్డాలతో పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించనున్నారు. బీజేపీ, జనసేన బంధంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అయితే ఏపీలో బీజేపీ, జనసేన మధ్య సఖ్యత లేదని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఓటు బీజేపీకి పడలేదు అంటూ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (Former MLC Madhav) బహిరంగంగానే ఆరోపించారు. అసలు జనసేనతో పొత్తు ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీతో కలిసి పోరాటమా లేక విడివిడిగా పోరాటమా అనేది ఈ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేన, బీజేపీ కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా కలిసి పోరాటం చేయని పరిస్థితి. బీజేపీ, జనసేన మధ్య బంధం కొనసాగుతుందా.. ఇక్కడి వరకే పరిమతం అవుతుందా అనేది చూడాల్సి ఉంది.

Updated Date - 2023-04-03T13:09:11+05:30 IST