Pawan Kalyan: 10న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన

ABN , First Publish Date - 2023-05-09T13:36:29+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(బుధవారం) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Pawan Kalyan: 10న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasean Chief Pawan Kalyan) రేపు(బుధవారం) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను జనసేనాని పరామర్శించనున్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటనను పార్టీ వర్గాలు విడుదల చేశాయి. దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులను కలుసుకుని వివరాలను జనసేనాధిపతి తెలుసుకోనున్నారు. పలు నియోజక వర్గాల మీదుగా పర్యటన సాగనుంది. పవన్‌‌తో కలిసి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం రాజమండ్రి చేరుకోనున్న పవన్ అక్కడి నుంచి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు.

janasena-1.jpg

గుంటూరులో జనసేన నేతలు...

కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో జనసేన నేతలు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అకాల వర్గాలకు నష్టపోయిన పంటలను జనసేన నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదని మండిపడ్డారు. రైతులకు పూర్తి స్థాయిలో పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్చేశారు. ప్రతి గ్రామంలో అకాల వర్షాలకు వందశాతం రైతులు నష్టపోయారన్నారు. అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంట నష్టం అంచనాలు వేయాలని డిమాండ్ చేశారు. రైతులపై గొప్పలు చెప్పుకొంటున్న ఈ ప్రభుత్వం చేసింది శూన్యమని వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-05-09T13:38:28+05:30 IST