YCP Minister: ఈ సవాల్‌ను స్వీకరించే సత్తా చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు ఉందా అంటూ జోగి రమేష్ ప్రశ్న
ABN , First Publish Date - 2023-06-29T20:40:16+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu), రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై వైసీపీ మంత్రి జోగి రమేష్ (YCP Minister Jogi Ramesh) విమర్శలు గుప్పించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu), రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై వైసీపీ మంత్రి జోగి రమేష్ (YCP Minister Jogi Ramesh) విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రకాశించని నవరత్నాలు అంటూ వాస్తవ పత్రాలు విడుదల చేయడంపై జోగి రమేష్ మండిపడ్డారు. వైసీపీ ఇస్తుంది ప్రకాశించే నవరత్నాలు, జగన్ చేస్తున్న సంక్షేమం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని మంత్రి తెలిపారు.
తమ కళ్లకు కనపడడం లేదా, గడప గడపకు వెళ్లి పధకాలు గురించి అడిగిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడుకి దమ్ము, దైర్యం, చీము నెత్తురు ఉంటే కుప్పం, టెక్కలి నియోజకవర్గంలో ఎక్కడైనా చర్చకు సిద్దమని జోగి రమేష్ సవాల్ చేశారు. 2014 నుంచి 19 వరకు కుప్పం, టెక్కలిలో ఎవరెవరికి ఏం ఇచ్చారని ఇద్దరు నేతలను మంత్రి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం మేలు చేశామో ప్రజలకు చెబుదామని, జగన్ ఏం చేశాడో, చంద్రబాబు ఏం చేశాడో అడుగుదామన్నారు. ఈ ఛాలెంజ్‌కి దమ్ముంటే ఒప్పుకోండి అని, సవాల్ స్వీకరించే సత్తా ఉందా అని చంద్రబాబు, అచ్చెన్నాయుడును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.