పింఛన్లు తొలగించడం సరైన నిర్ణయం కాదు : టీడీపీ

ABN , First Publish Date - 2023-01-03T23:26:04+05:30 IST

ఎన్నో సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేద ప్రజలకు ఇస్తున్న పింఛన్లను వైసీపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి తొలగించడం సరైన నిర్ణయం కాదని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

పింఛన్లు తొలగించడం సరైన నిర్ణయం కాదు : టీడీపీ
ఎంపీడీవో ఉపేంద్రకు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

ప్రొద్దుటూరు రూరల్‌, జనవరి 3 : ఎన్నో సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేద ప్రజలకు ఇస్తున్న పింఛన్లను వైసీపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి తొలగించడం సరైన నిర్ణయం కాదని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్‌ పేర్కొన్నారు. పేదల పింఛన్ల తొలగింపుపై మంగళవారం మండల టీడీపీ నేతలు ఎంపీడీవో ఉపేంద్రను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమ కుటుంబాలకు భారం కాకుండా వారి అవసరాలు గుర్తించి గత ప్రభుత్వాలు పింఛన్ల మంజూరు కార్యక్రమం చేపట్టాయన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాయమాటలతో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి రోజుకొక కొత్త నినాదాలు ఇస్తూ వారు ప్రవేశపెట్టిన నవరత్నాలకు వారే తూట్లు పొడుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ బీసీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బరాజు, కడప పార్లమెంటరీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహ, నందమూరి యువసేవా సమితి అధ్యక్షుడు జి.సుదర్శన్‌, కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ మత్స్య నాగభూషణం, జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శి బాలరాజు, గురప్పయాదవ్‌, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి మహే్‌షకుమార్‌, మౌళాలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-03T23:26:22+05:30 IST