గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నేతల ధర్నా

ABN , First Publish Date - 2023-06-18T23:12:35+05:30 IST

రాజోలులో మైనర్‌ బాలున్ని పెట్రోలు పోసి దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు సీఎం జగన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం రాజంపేట గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు.

గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నేతల ధర్నా
రాజంపేటలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

రాజంపేట, జూన్‌ 18: రాజోలులో మైనర్‌ బాలున్ని పెట్రోలు పోసి దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు సీఎం జగన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం రాజంపేట గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ బీసీ నాయకులు ఇడిమడకల కుమార్‌, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి అద్దేపల్లె ప్రతా్‌పరాజు, తెలుగు యువత అధ్యక్షుడు రాము యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యంనాయుడు, ప్రధాన కార్యదర్శి మన్నెం అబుబకర్‌, పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు కె.ఆర్‌.అనసూయాదేవి, ఎస్సీ సెల్‌ నాయకులు మందా శ్రీనివాసులు మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన మైనర్‌ బాలుడు అమర్‌నాధ్‌ను దారుణంగా హత్య చేయడం వైసీపీ రాక్షస పాలనకు అద్ధం పడుతోందన్నారు. జగన్‌ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలోని బీసీలకు జగన్‌ అడుగడుగునా ద్రోహం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా కార్యదర్శి లక్ష్మీదేవి, తుపాకుల గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-18T23:12:35+05:30 IST