ఓటమి భయంతోనే స్వతంత్ర అభ్యర్థిపై అనర్హత వేటు
ABN , First Publish Date - 2023-02-25T23:25:10+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటమి భయంతోనే స్వతంత్ర అభ్యర్థిపై అనర్హత వేటు వేశారని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
కడప (ఎర్రముక్కపల్లె), ఫిబ్రవరి 25: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటమి భయంతోనే స్వతంత్ర అభ్యర్థిపై అనర్హత వేటు వేశారని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. జమ్మలమడుగులో టీడీపీ అంటే శివారెడ్డి కుటుంబం, శివారెడ్డి అంటే టీడీపీ అని తెలిపారు. పొన్నపురెడ్డి కుటుంబానికి టీడీపీ ఎంతో చేసిందని చెప్పారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూ డా రామసుబ్బారెడ్డి పనిచేశారన్నారు. అటువంటిది ప్రస్తుతం టీడీపీపై దిగజారుడు మాటలు మాట్లాడడం బాధాకరమన్నారు. మరో అభ్యర్థి పోటీలో ఉంటే ఓడిపోతామన్న భయంతో ప్రతిపాదితులను భ యపెట్టి, వారి సంతకాలు ఫోర్జరీ అని చెప్పించి స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారని చెప్పారు.